Tamannaah Bhatia: తూచ్‌ అలాంటిదేమీ లేదు అంటున్న తమన్నా.. ఎందుకు అలా అన్నట్టు.?

Edited By: Prudvi Battula

Updated on: Apr 15, 2025 | 6:12 PM

దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే సామెతకు స్టిక్‌ ఆన్‌ అయినట్టున్నారు మిల్కీబ్యూటీ. అందుకే ఆమె అంత తొందరపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. కానీ, తమన్నా మాత్రం... తూచ్‌ అలాంటిదేమీ లేదు.. అసలు అలా ఎందుకు మాట్లాడుతారని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

1 / 5
నషా నషా అంటూ ఈ మధ్య నార్త్ లో యమాగా స్టెప్పులేశారు మిల్కీబ్యూటీ. సౌత్‌లో స్పెషల్‌ సాంగులు చేయడం తమన్నాకు అలవాటే. అయితే ఈ మధ్య స్త్రీ2లో ఆమె చేసిన స్టెప్పులు చూశాక, నార్త్ మేకర్స్ కూడా తమన్నా కాల్షీట్ల కోసం ఎంక్వయిరీలు మొదలుపెట్టేశారు.

2 / 5
భారీ సినిమాల్లో అవకాశాలు లేకనే తమన్నా స్పెషల్‌ సాంగులు చేస్తున్నారా? అనే క్వశ్చన్‌ రెయిజ్‌ అయితే బిగ్‌ నో అనే మాట వినిపిస్తోంది. తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని, మంచి సినిమాల్లో పార్ట్ కావడమే కీలకమని స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు మిల్కీ బ్యూటీ.

3 / 5
సినిమా కథ నచ్చితే పెద్దదా, చిన్నదా అని చూడనన్నది తమన్నా చెబుతున్న మాట. అంతే కాదు, జనాలను మెప్పించి, బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపించిన ప్రతి కథా తన దృష్టిలో పెద్దదేనంటున్నారు ఈ లేడీ.

4 / 5
ఇంతకీ తమన్నా పెళ్లెప్పుడు చేసుకుంటారని ఆరా తీస్తే... బిగ్‌ నో అనే మాట వినిపిస్తోంది. ఇప్పట్లో అలాంటి ఉద్దేశమే లేదన్నారు తమన్నా. కెరీర్‌ మీద దృష్టిపెడుతున్నానని చెప్పారు. విజయ్‌వర్మతో బ్రేకప్‌ అయిందంటూ ఈ మధ్య వార్తలు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

5 / 5
తెలుగులో ఆమె నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం  ఓదెల 2 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మిల్కీ బ్యూటీ  శివశక్తిగా కనిపించనుంది. ఇప్పట్టికే వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. 