దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా చాలా హిట్లు వచ్చినా.. వింటేజ్ మహేష్ మాత్రం మిస్ అయిపోయారు. ఒక్కడు, అతడు, పోకిరిలో కనిపించిన మహేష్ మాకు కావాలంటున్నారు ఫ్యాన్స్. ఇన్నేళ్లకు త్రివిక్రమ్ ఇది అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు.