
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన క్యూట్‌నెస్‌తో ఈ బ్యూటీ ఎంతో మంది మదిని దోచేసింది. పెళ్లి సందడి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన నటన, అందం, డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసి తన నటతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ, అవి చాలా వరకు డిజాస్టర్‌గా మిగిలాయి. దీంతో కొన్ని రోజుల పాటు ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గాయి, తర్వాత పుష్ఫ2లో ఐటమ్ సాంగ్‌తో మళ్లీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. సక్సెస్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలు క్యూ కట్టాయి.

శ్రీలీలకు తెలుగులో రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపే వచ్చింది.. కొన్నిసార్లు విజయాలు తక్కువగానే ఉన్నా అవకాశాలు మాత్రం అదిరిపోయాయి. రెండేళ్ళ పాటు గుక్క తిప్పుకోకుండా సినిమాలు చేసారు ఈ బ్యూటీ. ఈ మధ్యే కాస్త ఖాళీగా మారిపోయారు ఈ డాక్టర్ గారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తెలుగులో శ్రీలీల చేస్తున్న సినిమా.

ఉస్తాద్ కూడా ఇప్పుడు సైన్ చేసిన సినిమా కాదు.. ఏడాదిన్నర కిందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు శ్రీలీల. ఇది మినహా తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు ఈ బ్యూటీ. పైగా వరస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టైమ్‌లో శ్రీలీల ఫోకస్ అంతా తమిళ, హిందీ వైపు వెళ్తుంది. ఇప్పటికే తమిళంలో పరాశక్తితో డెబ్యూ చేసారు శ్రీలీల.

పరాశక్తి ప్లాప్ అయినా.. తమిళం నుంచి శ్రీలీలకు ఆఫర్స్ మొదలయ్యాయి. తాజాగా ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి సినిమాలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారు ఈ భామ. మరిన్ని సినిమాలు కూడా ఈ భామ చెంతకు వస్తున్నాయి. గతంలో కృతి శెట్టి, తమన్నా, మీనాక్షి చౌదరి ఇలా చాలా మంది హీరోయిన్లు ముందు తెలుగు.. ఆ తర్వాత తమిళంలో బిజీ అయ్యారు.