Sai Dharam Tej: దూకుడు మీదున్న మెగా మేనల్లుడు.. వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్

| Edited By: Phani CH

Dec 01, 2023 | 2:30 PM

ఫ్లాపులొస్తే తట్టుకుని నిలబడటం పెద్ద కష్టమేం కాదు. కానీ ప్రాణాల మీదకు వచ్చాక తట్టుకుని నిలబడటం.. మళ్లీ హిట్ కొట్టడం మాత్రం చిన్న విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపించారు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఈయన కెరీర్‌లో జోరు మరింత పెరిగింది. వరసగా సినిమాలు సైన్ చేస్తున్నారు మెగా మేనల్లుడు. మరి తేజ్ చేస్తున్న ఆ సినిమాలేంటి..? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఎంట్రీ ఈజీగానే ఉన్నా అంచనాలు మాత్రం మామూలుగా ఉండవు. సాయి ధరమ్ తేజ్ కూడా అంతే బరువు మోస్తూ ఇండస్ట్రీకి వచ్చారు.

1 / 5
ఫ్లాపులొస్తే తట్టుకుని నిలబడటం పెద్ద కష్టమేం కాదు. కానీ ప్రాణాల మీదకు వచ్చాక తట్టుకుని నిలబడటం.. మళ్లీ హిట్ కొట్టడం మాత్రం చిన్న విషయం కాదు. కానీ దాన్ని చేసి చూపించారు సాయి ధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఈయన కెరీర్‌లో జోరు మరింత పెరిగింది. వరసగా సినిమాలు సైన్ చేస్తున్నారు మెగా మేనల్లుడు. మరి తేజ్ చేస్తున్న ఆ సినిమాలేంటి..?

2 / 5
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు ఎంట్రీ ఈజీగానే ఉన్నా అంచనాలు మాత్రం మామూలుగా ఉండవు. సాయి ధరమ్ తేజ్ కూడా అంతే బరువు మోస్తూ ఇండస్ట్రీకి వచ్చారు.

3 / 5
తొలి సినిమా పిల్లా నువ్వులేని జీవితంతో తేజ్ కెరీర్‌కు పునాది పడింది. రేయ్ ఫ్లాపైనా.. అది కనబడనీకుండా చేసాయి సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లాంటి విజయాలు. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది.

4 / 5
హ్యాట్రిక్‌తో జోరు మీదున్న తేజ్‌కు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చాయి. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు సినిమాలు నిరాశ పరచడమే కాదు.. తేజ్ మార్కెట్‌ను పూర్తిగా పడేసాయి. స్టోరీ సెలక్షన్‌లో వీక్ అంటూ ఈ హీరోపై విమర్శలు వచ్చాయి. ఆ టైమ్‌లో చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చారు.

5 / 5
రిపబ్లిక్ ఫ్లాపైనా.. నటుడిగా తేజ్‌ను మరో మెట్టు ఎక్కించింది. కానీ 2021 తేజ్ జీవితంలో ఊహించని కుదుపు రోడ్ యాక్సిడెంట్. తృటిలో బయటపడిన ఈయన.. 2023లో విరూపాక్షతో బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. బ్రో..లో పవన్‌తో నటించారు. ప్రస్తుతం సంపత్ నందితో గాంజా శంకర్‌గా వస్తున్నారు. దీంతో పాటు మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మొత్తానికి మాంచి దూకుడు మీదున్నారు మెగా మేనల్లుడు.