అన్ ప్రెడిక్టబుల్.. అన్‌ప్రెడిక్టబుల్.. గేమ్‌చేంజర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ మాట పాపులర్ అవుతోంది. అంతగా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఏం ఉండబోతోంది సినిమాలో..
డిసెంబర్ 29న రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంఛ్ జరగనుంది. విజయవాడలో 256 ఫీట్లతో కటౌట్ ఏర్పాటు చేసారు. దీనికి ముఖ్య అతిథిగా తమన్ వెళ్తున్నారు.
గతంలో రంగస్థలం విజయోత్సవానికి పవన్ వచ్చారు. అప్పట్లో నాయక్ వేడుకలోనూ కనిపించారు. మళ్లీ బాబాయ్ అబ్బాయి కలిస్తే అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా.
చరణ్, కియారా ఎంట్రీ ఇచ్చిన తీరు నార్త్ ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. చరణ్ మాట్లాడిన విధానానికి మురిసిపోతున్నారు అభిమానులు.
శంకర్ ఎడిటింగ్ ఫైనల్ చేయడంలో బిజీగా ఉంటే, టీజర్ లాంఛ్ ప్రోగ్రామ్‌ని ముందుండి నడిపించారు నిర్మాత దిల్‌రాజు.
ఈ ప్రాజెక్ట్ ఆయన ఎందుకు చేయాలనుకున్నారో.. ఆయన మాటల్లోనే విన్నవారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గేమ్‌చేంజర్ ఈవెంట్ స్టేజ్ మీద కియారా, అంజలి, ఎస్‌జె సూర్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
గేమ్ చేంజర్‌లో రామ్ ఇంతకీ ఎవరు? అతని చర్యలకు అందరూ అంతలా అవాక్కు కావాల్సిన అవసరం ఏంటో తెలియాలంటే జనవరి 10 దాకా వెయిట్ చేయాల్సిందే.