
చాలా మంది హీరోయిన్స్ పెద్ద ప్రాజెక్ట్‌లో చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎంత చిన్న పాత్ర అయినా సరే స్టార్ హీరో మూవీలో మాత్రం నటించాలి అనుకుంటారు. కానీ ఈ బ్యూటీ ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినా చాలా సులభంగా రిజక్ట్ చేసిందంట. అయితే దీనికి కూడా కారణం ఉన్నదంటూ, ఆ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అందాల ముద్దుగుమ్మ మలయాళం బ్యూటీ సాస్విక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. తన అంద చందాలతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఈ చిన్నది పెద్ది సీమాలో ఓ పాత్రకు చాలా బాగా సెట్ అవుతుందిని మూవీ యూనిట్ ఈ బ్యూటీని సంప్రదించారంట. కానీ చాలా సులభంగా చిన్నది రిజక్ట్ చేసిందంట. ఓ ఇంటర్యూలో దానికి మూవీ వదులుకోవడానికి గల కారణం తెలియజేసింది.

ఆమె మాట్లాడుతూ, నాకు పెద్ది సినిమాలో అవకాశం వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ రామ్ చరణ్‌కు తల్లిగా నటించమన్నారు. దీంతో నేను మూవీకి నో చెప్పాను. నా వయసు 33 ఏళ్లు ఇప్పుడు నాకు తల్లి పాత్రలు చేయడం అంతగా ఇష్టం లేదు, తమిళ మూవీ లబ్బర్ పందులో హీరోయిన్ తల్లిగా నటించా. అప్పటి నుంచి చాలా చిత్రాల్లో తల్లి రోల్స్ వచ్చాయి. వాటన్నింటినీ రిజక్ట్ చేశాను.

ఈ క్రమంలోనే పెద్ది మూవీలో కూడా తల్లి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ నాకు రామ్ చరణ్‌కు తల్లిగా నటించడం ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ అందాల మద్దుగుమ్మ చివరగా తెలుగులో నితిన్ తమ్ముడు చిత్రంలో నటించింది.