Nayanthara: ఆ డైరెక్టర్‌ వర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిపోతున్న నయనతార

Edited By: Phani CH

Updated on: Jul 27, 2025 | 9:37 PM

అంత ఈజీగా నయనతార ఏ దర్శకుడిని పొగడరు.. ఇంకా చెప్పాలంటే అసలు సినిమా గురించి కూడా మాట్లాడరు.. తన పని తాను చేసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంటారు. కానీ తాజాగా నయన్ మనసు గెలుచుకున్నారు ఓ దర్శకుడు.. ఆయన వర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు ఈ బ్యూటీ. ఇలాంటి డైరెక్టర్‌ను ఇన్నాళ్లెలా మిస్ అయ్యానా అంటున్నారు నయన్. మరి ఎవరా దర్శకుడు..?

1 / 5
40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ.

2 / 5
రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండీషన్స్ పెట్టినా.. నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవుతుంటారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్.

3 / 5
ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్‌కు నయనతార ఫిదా అయిపోతున్నారు. అనుకున్న దానికంటే వేగంగా జరుగుతుంది ఈ చిత్ర షూట్. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుడిని ప్రశంసించని నయన్.. అనిల్ రావిపూడికి వర్కింగ్ స్టైల్‌కి పడిపోయారు.

4 / 5
అతన్ని మునగ చెట్టెక్కించేస్తుంది ఈ బ్యూటీ. చెప్పిన టైమ్ కంటే ముందుగానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివి తేటలు చూసి మురిసిపోతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. సంక్రాంతికి మెగా 157 విడుదల కానుంది. గతంలో గాడ్ ఫాదర్, సైరాలో కలిసి నటించారు చిరు, నయన్.

5 / 5
తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ బిజీగా ఉన్నారు నయనతార. ఈమె చేతిలో భారీ సినిమాలున్నాయి. మూకూతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్, హాయ్, రెక్కయి, మన్నంగాట్టి సిన్స్ 1960 లాంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయన్. కానీ ఆ సినిమాలన్నింటి కంటే అనిల్ రావిపూడి సినిమానే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ.