Kajal Aggarwal: వర్కవుట్ అవ్వని కాజల్ సెకండ్ ఇన్నింగ్స్.. హిట్ కోసం రూట్ మార్చిన ముద్దుగుమ్మ

Edited By: Phani CH

Updated on: Jun 24, 2025 | 8:34 PM

టాలీవుడ్ స్క్రీన్ మీద అందాల భామలకు సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కవుట్ కాదు. ఒక వేళ మళ్లీ తెర మీద కనిపించాలనుకున్నా... సపోర్టింగ్‌ రోల్స్‌తోనే సరిపెట్టుకోవాలి. కానీ ఆ ఉద్దేశం తనకు లేదంటున్నారు హాట్ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. రీ ఎంట్రీలోనూ హీరోయిన్‌ రోల్స్ మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. పెళ్లి ప్రెగ్నెన్సీ కారణంగా సిల్వర్‌ స్క్రీన్ చందమామకు కెరీర్‌లో కాస్త గ్యాప్ వచ్చింది.

1 / 5
పెళ్లి ప్రెగ్నెన్సీ కారణంగా సిల్వర్‌ స్క్రీన్ చందమామకు కెరీర్‌లో కాస్త గ్యాప్ వచ్చింది. కానీ అప్పటికే కాజల్‌ ఫామ్ తగ్గటంతో రీ ఎంట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. ముఖ్యంగా కమర్షియల్ హీరోయిన్‌ రోల్స్‌లో అసలే కనిపించలేదు ఈ బ్యూటీ.

2 / 5
గత ఆరేళ్లలో ఈ బ్యూటీ కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేదు. భగవంత కేసరి హిట్ అయినా.. ఆ సినిమాలో అసలు కాజల్‌ క్యారెక్టర్‌ ఎందుకు ఉందో ఎవరిక అర్ధం కాలేదు. ఈ టైమ్‌లో డిజిటల్‌ ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పారు కాజల్‌.

3 / 5
కానీ అవి కూడా అమ్మడి కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయాయి. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్‌. ఈ టైమ్‌లో కాజల్‌ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

4 / 5
ఈ ఇయర్‌ బర్త్‌ డేను ఫ్యామిలీతో కలిసి మాల్‌దీవ్స్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన చందమామ... నెటిజెన్స్‌కు షాక్ ఇచ్చారు. పెళ్లి తరువాత పెద్దగా గ్లామర్ యాంగిల్‌  చూపించని ఈ బ్యూటీ..,. సడన్‌గా బికినీలో దర్శనమిచ్చారు.

5 / 5
బీచ్‌లో చెల్లెలు నిషా అగర్వాల్‌తో కలిసి సింగిల్‌ పీస్‌ బికినీలో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు. సడన్‌ ఈ రేంజ్‌ గ్లామర్‌ చేయటం వెనుక రీజనేంటన్న డిస్కషన్ జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసమే కాజల్‌ ఇంత గ్లామరస్‌గా మారారంటున్నారు నెటిజెన్స్‌. మరి అమ్మడి కష్టానికి ఎంత వరకు ఫలితం దక్కుతుందో చూడాలి.