
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ కూడా ఒకడు. ఇక సాధారణ ఆర్టిస్టుగా ఈ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతను తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. 'కెవ్వు కార్తిక్' పేరుతో అతని చేసే స్కిట్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే యూట్యూబ్ లోనూ కార్తీక్ స్కిట్స్ కు చాలా మంది రెస్పాన్స్ వస్తోంది.

కాగా లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్నివదిలి పెట్టి మర ఇండస్ట్రీలోకి వచ్చాడు కెవ్వ కార్తిక్. ఇప్పుడు తన ప్రతిభతో జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్.

టీవీ షోలు, సినిమాల సంగతి పక్కన పెడితే.. రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. తమ పండంటి కాపురానికి ప్రతీకగా ఈ ఏడాది మే 17న శ్రీకరి అనే ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారీ జబర్దస్త్ కపుల్.

తాజాగా తన కూతురు పుట్టు వెంట్రుకలను యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామివారికి సమర్పించాడు కెవ్వు కార్తీక్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించాడీ జబర్దస్త్ కమెడియన్.

ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా కార్తీకే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు కెవ్వు కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.