Rashmika VS Janhvi: రష్మిక Vs జాన్వీ.. ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు?

| Edited By: Phani CH

Mar 17, 2025 | 8:41 PM

ఇండియన్‌ సినిమా గ్లామర్‌ వరల్డ్ లో ఎవరి గురించి మాట్లాడినా... అర్రే.. ఆ టాపిక్‌లో నేను లేకుంటే ఎలా అని అంటున్నారు రష్మిక మందన్న. రీసెంట్‌గా జాన్వీ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ని డీకోడ్‌ చేస్తున్నవారు కూడా.. ఈ మధ్యే రష్మిక చేసిన ఓ యాక్టివిటీని ఎగ్జాంపుల్‌గా చూపించి కంపేర్‌ చేస్తున్నారు. ఇంతకీ జాన్వీ ఏమన్నారు? రష్మిక ఏం చేశారు?

1 / 5
నేను ఆ మూడు రోజులూ నిద్రపోలేదు.. అని అన్నారు జాన్వీకపూర్‌. ఎందుకూ.. ఏమైంది? అని ఆరా తీస్తే.. నాలుగేళ్ల క్రితం నటించిన రూహీ సినిమా సంగతుల్ని చెప్పుకొచ్చారు.

2 / 5
అందులో నదియో పార్‌ సాంగ్‌ బాగా క్లిక్‌ అయింది. ఈ పాట షూట్‌ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట జాన్వీ కపూర్‌. ఓ వైపు గుడ్‌ లక్‌ జెర్రీ షూట్‌లో పార్టిసిపేట్‌ చేసి.. ఆ తర్వాత రిహార్సల్స్ చేసేవారట.

3 / 5
కాస్త పర్ఫెక్షన్‌ వచ్చిందనిపించగానే షూట్‌ చేసేవారట. అలా మూడు రోజులు నిద్రలేదని, ఆ సెట్లో లైటింగ్‌కి కళ్లు మూసుకుపోయేవని గుర్తుచేసుకున్నారు శ్రీదేవి డాటర్‌.

4 / 5
ఆమె మాటలు విన్నవారు రీసెంట్‌గా రష్మిక గురించి అల్లు అర్జున్‌ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్నారు. పుష్ప2 నాన్‌స్టాప్‌ ప్రమోషన్లకు హాజరయ్యారు రష్మిక మందన్న. ఆ సమయంలోనే ఛావాలో ఇంపార్టెంట్‌ సాంగ్‌ కూడా షూట్‌ చేశారు.

5 / 5
అటు చావా సాంగ్‌ షూట్‌, ఇటు పుష్ప పనులతో మూడు నాలుగు రోజులు నిద్రపోలేదట రష్మిక మందన్న. ట్రావెల్‌ సమయంలోనే కునుకు తీసేవారట. హీరోయిన్ల లైఫ్‌ సూపర్‌ అనుకుంటాం కానీ, ఫీల్ల్ ఏదయినా, ఎక్కడ కష్టాలు అక్కడ ఉంటూనే ఉంటాయనే డిస్కషన్‌ మరోసారి షురూ అయింది.