
ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క..! తమన్నాను చూస్తుంటే మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగే గుర్తుకొస్తుందిప్పుడు. 17 ఏళ్ళ కెరీర్‌లో ఫాలో అయిన పద్దతులన్నీ తీసి పక్కనబెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ..

పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్‌లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్సైపోయారు. తాజాగా మళ్లీ రెచ్చిపోయారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తమన్నా గ్లామర్ కూడా డబుల్ అవుతుంది.

అందాల ఆరబోతకు ఎప్పుడూ మిల్కీ బ్యూటీ విరుద్ధం కాదు.. కానీ అందులోనే హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్.. లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు.

కానీ కెరీర్ చివరికి వచ్చేస్తున్నపుడు రూల్స్ పెట్టుకుంటే.. ఛాన్సులు రావని అన్నీ పక్కనబెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా.. వెబ్ సిరీస్ చేసినా అందులో గ్లామర్ డోస్ మాత్రం బాగా ఉంటుంది. ముఖ్యంగా అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు.

ఈ మధ్యే విడుదలైన జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్‌లలో తమన్నా నెక్ట్స్ లెవల్ గ్లామర్ షో చేసారు. ఇంటిమేట్ సీన్స్‌లోనూ రెచ్చిపోయారు. ఇక హాట్ ఫోటోషూట్స్‌కు అయితే ఢోకా లేకుండా చూసుకుంటున్నారు ఈ సీనియర్ హీరోయిన్.

తమన్నా ఈ మధ్యే భోళా శంకర్, జైలర్ సినిమాలతో వచ్చారు. భోళాలో ఫుల్ లెంత్ రోల్ చేసినా అద డిజాస్టర్ అయింది.. జైలర్ బ్లాక్‌బస్టర్ అయినా అందులో తమన్నా కనిపించింది ఒక్క సాంగ్‌లో మాత్రమే.

దాంతో రెండూ ఈమె కెరీర్‌కు హెల్ప్ అవ్వలేదు. దాంతో కెరీర్ చరమాంకంలో అందాల హద్దులు చెరిపేస్తున్నారు తమన్నా. మరి ఈ షో ఆమె కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.