
ఇయర్ స్టార్టింగ్‌లో జరిగిన ఓ వండర్, ఇప్పుడు ఇయర్ ఎండింగ్‌లోనూ రిపీట్ అవుతోంది. అప్పుడూ ఒన్ ఇస్‌టు టు రేషియోనే. ఇప్పుడూ సేమ్ టు సేమ్ ఒన్ ఇస్‌టు టు రేషియోనే.

రష్మిక వర్సెస్ శ్రుతి.. ఇంట్రస్టింగ్ గేమ్ మరోసారి షురూ అయింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విజయ్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో కలిసి యాక్ట్ చేయడం డ్రీమ్ కమ్ ట్రూ అంటూ పొంగిపోయారు రష్మిక మేడమ్.

ఆమె ఆనందానికి తగ్గట్టుగానే వారసుడు పెద్ద హిట్ అయింది. ఇయర్ స్టార్టింగ్‌లో ఓ హిట్.. ఇప్పుడు ఇయర్ ఎండింగ్‌లో యానిమల్‌తో మరో హిట్ కిట్టీలో వేసేసుకున్నారు రష్మిక.

ఈ ఏడాది సంక్రాంతికి రష్మికతో పోటీపడ్డ నటి శ్రుతిహాసన్. నువ్వు శ్రీదేవయితే, నేను చిరంజీవినవుతా అంటూ మెగాస్టార్ మంచుకొండల్లో శ్రుతితో కలిసి ఇష్టంగా స్టెప్పులేశారు.

వాల్తేరు వీరయ్య అలా పొగిడితే, వీరసింహారెడ్డి మాత్రం సుగుణ సుందరి అంటూ ఆమె వెంట తిరిగి తిరిగి పాటలు పాడారు. అలా సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణతో నటించి డబుల్ సక్సెస్ అందుకున్నారు శ్రుతి.

ఇయర్ స్టార్టింగ్‌లో ఉన్న స్పీడ్‌ని ఇయర్ ఎండింగ్‌లోనూ కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ సలార్ ట్రైలర్ రిలీజ్ అయింది. డిసెంబర్ 22న రిలీజ్‌కి కూడా రెడీ అవుతోంది. వచ్చే శుక్రవారం నాని హీరోగా హాయ్ నాన్న రిలీజ్‌కి రెడీ అవుతోంది.

హాయ్ నాన్నలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా, ఆమె కేరక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుందనే అంటున్నారు మేకర్స్. సో రష్మికలాగా శ్రుతి కూడా ఇయర్ ఎండింగ్‌లో బొంబాట్ చేస్తారా?