Film News: త్వరలో గుంటూరు కారం చిత్రీకరణ పూర్తి.. ‘దూత’ విడుదల ఖరారు..

| Edited By: Prudvi Battula

Nov 16, 2023 | 9:01 AM

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా గుంటూరు కారం. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా మహేష్ రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అథర్వ. నాగ చైతన్య సినిమాలతో పాటుగా డిజిటిల్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా, లీషా ఎక్లైర్స్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ రైట్. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు తెరకెక్కిస్తున్న పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'రాధా మాధవం'. 

1 / 5
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని ఇప్పటికే చాలా సార్లు ఖరారు చేసారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కూడా దీనికి తగ్గట్లుగానే జరుగుతుంది. ఓ వారం టాకీ పార్ట్.. మరో నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 20న నాటికి షూటింగ్ అంతా పూర్తి చేయనున్నారు త్రివిక్రమ్.

2 / 5
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా మహేష్ రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అథర్వ. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేసారు దర్శక నిర్మాతలు. తాజాగా అథర్వ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. దీనికి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.

3 / 5
నాగ చైతన్య సినిమాలతో పాటుగా డిజిటిల్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్‌తో కలిసి దూత వెబ్ సిరీస్ చేస్తున్నారీయన. చాలా రోజులుగా పెండింగ్‌లోనే ఉన్న దూత డిసెంబర్ 1 నుంచి ఓ ప్రముఖ ఓటిటిలో ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.

4 / 5
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా, లీషా ఎక్లైర్స్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ రైట్. మలయాళంలో దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘మెమోరీస్’ సినిమాకు రీమేక్ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి రైట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 30న విడుదల కానుందని తెలిపారు మేకర్స్.

5 / 5
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు తెరకెక్కిస్తున్న పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'రాధా మాధవం'. ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. 'పెళ్లి చూపులు'తో పాటు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.