
ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఒక మహిళ.. తర్వాత సినీరంగంలో తిరుగులేని కథానాయికగా మారారు. ఆమె బాల్యం హింస, మానసిక వేదనతో నిండిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులో తన సొంత తండ్రి చేత లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె వెల్లడించారు. అదే వ్యక్తి తన తల్లిని, సోదరులను కొట్టడాన్ని ఆమె కళ్లారా చూశానని అన్నారు. ఆమె హిందీ సినిమాల్లో బాలనటిగా పనిచేయడం ప్రారంభించినప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఆమెకు 'ఖుష్పు' అనే పేరు పెట్టారు.

మనం మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ పేరు ఖుష్బూ. . ఆమె తొలిసారిగా 'ది బర్నింగ్ ట్రైన్' చిత్రంలో "తేరీ హై జమీన్ తేరా ఆస్మాన్" అనే పాటతో తెరపై కనిపించింది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు, ఆమె హిందీ చిత్రాలలో బాలనటిగా నటించింది. 16 ఏళ్ల వయసులో చెన్నై చేరుకున్న ఆమె.. . అక్కడ, నిర్మాత టి. రామానాయుడు , దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆమెను పరిచయం చేయగా, వెంకటేశ్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

తెలుగు, కన్నడలో దాదాపు 12 సినిమాల్లో నటించారు. ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వం వహించిన, రజనీకాంత్ నటించిన 'ధర్మతిన్ తలైవన్' చిత్రంతో ఖుష్బూ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ ఉన్న కథానాయికగా తదనైన ముద్ర వేసింది. అభిమానులు ఆమె చిత్రాలను ఆరాధించారు. అంతేకాదు ఆమె పేరు మీద ఏకంగా గుడి నిర్మించి ఆమెను పూజించారు. తమిళనాడులోని తిరుచెందూర్ జిల్లా సమీపంలో, కొందరు భక్తులు నిర్మించిన ఒక ఆలయం ఇప్పటికీ ఉంది.

అక్కడ భక్తులు ఖుష్బూను పూజిస్తారు. వస్తువులకు ఆమె పేరు పెట్టారు. వస్త్ర దుకాణాలలో 'ఖుష్బూ చీరలు' ఒక ప్రత్యేక విభాగంగా మారాయి. స్థానిక మార్కెట్లలో 'ఖుష్బూ కాఫీ' కూడా ఏర్పడింది. అత్యంత ప్రసిద్ధి చెందిన 'ఖుష్బూ ఇడ్లీ' మదురైలో పుట్టింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో 200కి పైగా సినిమాలు చేసింది.

తన కెరీర్ శిఖరాగ్రంలో, 1991 నుండి 1996 వరకు సుమారు ఐదేళ్లపాటు, ఆమె తమిళ సినిమా రంగంలో అగ్ర కథానాయికగా వెలుగొందారు. 2000వ సంవత్సరంలో, 'మురయ్యా మామన్' చిత్రంలో తనకు దర్శకత్వం వహించిన చిత్ర దర్శకుడు సుందర్ సి.ని ఖుష్బూ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు అవంతిక , ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో సహయ నటిగా నటిస్తుంది ఖుష్బూ. మరోవైపు రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటుంది.