
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే చాలా మంది హీరోలతో ఆయన కలిసి వర్క్ చేశాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఆయన సినిమా చేశారు అదే వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా విడుదకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాలో ఐదురోజుల పెళ్లి అంటూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా 2010లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుడు సినిమాలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటేన్ చేశాడు దర్శకుడు గుణశేఖర్. సినిమా మొదలైన చాలా సమయం తర్వాత హీరోయిన్ ను చూపిస్తాడు. ప్రేక్షకులకు అది కాస్త ఎక్కలేదు.

ఇంతకు ఈ హీరోయిన్ గుర్తుందా.? ఆ హీరోయిన్ పేరు భాను శ్రీ మెహ్ర. వరుడు సినిమాతో ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా కంటే ముందు హిందీలో ఓ సినిమా చేసింది. వరుడు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. భానుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత హిందీలో, అలాగే తమిళ్ లో సినిమాలు చేసింది.కానీ హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. అయినా కూడా పెద్దగా ఈ అమ్మడికి కలిసిరాలేదు. ఇక ఇప్పుడు ఈ భామ చేతిలో సినిమాలు లేవు. దాంతో ఈ భామ ఇప్పుడు ఎక్కడుంది. ఏం చేస్తుందంటూ.. నెటిజన్స్ గాలిస్తున్నారు.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. క్రేజీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందా అని నెటిజన్స్ సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. రెగ్యులర్ గా వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి వీడియోలు షేర్ చేస్తుంది.