Trisha Krishnan : త్రిషతో లిప్ లాక్ సీన్.. వద్దంటే వద్దన్న హీరో.. కారణం ఏంటంటే..

Updated on: May 11, 2026 | 12:31 PM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అటు నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ కెరీర్, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.

1 / 5
సౌత్ ఇండస్ట్రీలో త్రిష స్టార్ హీరోయిన్. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. మరోవైపు విజయ్ దళపతి సీఎం కావడం.. కొన్ని రోజులుగా నెట్టింట త్రిష పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిషకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఓ సినిమాలో త్రిషతో లిప్ లాక్ సీన్ ఉండగా.. చేయనని మొండికేశారట ఓ స్టార్ హీరో. త్రిషతో అలాంటి సీన్ ఉంటే అసలు చేయనని.. ఆ సన్నివేశాన్ని తొలగించాలని ఖరాఖండిగా చెప్పాడట. ఇప్పుడు ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అతడు మరెవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

2 / 5
విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన '96' సినిమా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. రామ్, జాను పాత్రల మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమకథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే ఈ చిత్ర క్లైమాక్స్‌లో ఒక లిప్ కిస్ సీన్ ఉండాల్సిందని, దానికి త్రిష అంగీకరించినప్పటికీ విజయ్ సేతుపతి వద్దని చెప్పారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా కథ ప్రకారం రామ్, జాను దాదాపు 22 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. వారిద్దరూ మళ్లీ ఎప్పుడు కలుస్తారో తెలియని ఒక ఎమోషనల్ పాయింట్ లో క్లైమాక్స్ ఉంటుంది.

3 / 5
ఈ క్రమంలో, ఆ భావోద్వేగాన్ని మరింత పండించడానికి ఒక చిన్న ముద్దు సన్నివేశం ఉంటే బాగుంటుందని దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ భావించారట. దీని గురించి త్రిషకు వివరించగా, కథా పరంగా ఆ సన్నివేశం అవసరమని భావించిన ఆమె ఏమాత్రం సంకోచించకుండా ఓకే చెప్పారట.  సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి సీన్స్‌కు నో చెబుతుంటారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. విజయ్ సేతుపతి ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దానికి ఆయన చెప్పిన కారణం సినిమా విజయానికి ఒక ప్రధాన కారణమైంది.

4 / 5
"ఈ సినిమా అంతా ఒక ప్యూర్ లవ్ స్టోరీగా సాగుతుంది. రామ్ పాత్రలో ఒక స్వచ్ఛత ఉంది. క్లైమాక్స్‌లో కిస్ సీన్ పెడితే ఆ పాత్ర గాఢత, సినిమాలోని పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఆ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్‌ కనెక్షన్‌ను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలి" అని విజయ్ సేతుపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. విజయ్ సేతుపతి మాటల్లోని నిజాన్ని గ్రహించిన దర్శకుడు ఆ సీన్‌ను పక్కన పెట్టేశారు. కేవలం కళ్ళతోనే మాట్లాడుకుంటూ, ఒక చిన్న కౌగిలింతతో ముగిసే ఆ క్లైమాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది.

5 / 5
ఒకవేళ ఆ రోజు ముద్దు సన్నివేశం పెట్టి ఉంటే, '96' సినిమా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించేది కాదేమో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమైన ప్రేమకు శారీరక ఆకర్షణ కంటే మానసిక బంధం ముఖ్యమని చాటిచెప్పిన ఈ చిత్రం, నటీనటుల పరిణతి చెందిన నిర్ణయాల వల్ల ఒక అద్భుతమైన కావ్యంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ వార్త విన్న అభిమానులు "విజయ్ సేతుపతి నిర్ణయం చాలా గొప్పది" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us