బాలీవుడ్‌లో రష్మిక, దీపిక మధ్య సమరం.. నేనంటే నేనటున్న ముద్దుగుమ్మలు

Edited By: Phani CH

Updated on: Mar 07, 2025 | 7:45 PM

ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు అంటూ కొదమసింహంలో చిరంజీవి స్టైల్‌లో దూసుకుపోతున్నారు దీపిక పదుకొనే. బాలీవుడ్‌లో ఈమె జోరును అడ్డుకునే భామే లేదు.. కానీ ఇప్పుడు నేనున్నాను అంటూ వచ్చేసారు రష్మిక మందన్న. బాక్సాఫీస్ లెక్కల దగ్గర ఈ ఇద్దరు బ్యూటీస్ మధ్య అదిరిపోయే వార్ జరుగుతుంది. మరి అదేంటో మనమూ చూసేద్దామా..?

1 / 5
ఇటు విజయాలు.. అటు వివాదాలు రెండూ ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక మందన్న. ఈమె ప్రస్తుతం గోల్డెన్ లెగ్ కాదు.. ఏకంగా డైమండ్ లెగ్ అయిపోయింది. అడుగేస్తే 500 కోట్లు.. వర్కవుట్ అయితే 1000 కోట్లు అన్నట్లుంది ఇప్పుడు ఈ భామ జోరు. గత ఏడాదిగా బాలీవుడ్‌ను రూల్ చేస్తున్నారు రష్మిక మందన్న. ఈమె కంటే ముందు దీపిక ఈ ప్లేస్‌లో ఉండేది.

2 / 5
బాలీవుడ్‌లో అత్యధిక 500 కోట్ల సినిమాల రికార్డ్ ఇన్నాళ్లూ దీపిక పదుకొనే దగ్గరే ఉంది. 2023లో ఈమె నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కేవలం హిందీలోనే 500 కోట్లకు పైగా వసూలు చేసాయి.

3 / 5
ఇప్పుడీ రికార్డ్ రష్మిక బద్ధలు కొట్టేసారు. పుష్ప 2, యానిమల్ సినిమాలు హిందీలో 500 కోట్లకు పైగానే వసూలు చేసాయి.. తాజాగా ఛావాతో మూడో 500 కోట్ల వైపు అడుగేస్తున్నారు ఈ బ్యూటీ.

4 / 5
దీపికా పదుకొనే ప్రస్తుతం ఒకప్పటి జోరు చూపించట్లేదు. కల్కి 2 మాత్రమే కమిటయ్యారు. కానీ రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రంజాన్‌కు సల్మాన్ ఖాన్‌తో నటిస్తున్న సికిందర్ విడుదల కానుంది.

5 / 5
ఇది హిట్టైతే నాలుగో సారి 500 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసుకున్నా.. రాబోయే రెండేళ్ల వరకు బాలీవుడ్ పగ్గాలు రష్మిక చేతుల్లోనే కనిపిస్తున్నాయి.