Animal Movie: యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్.. ఆ విషయంలో నా దారి రహదారి అంటున్న సందీప్..
సినిమా రన్ టైమ్... ఒక్కోసారి ఆ సినిమాకు శాపంగానూ, మరోసారి వరంగానూ మారుతుంది. కానీ అవేవీ తనకు వర్తించవంటున్నారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో పగా వేసిన సందీప్ వంగా. తన లెటెస్ట్ మూవీ యానిమల్ విషయంలో సందీప్ వంగా ఆడియెన్స్ కు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ హిట్ అందుకొని బాలీవుడ్ లో తిష్టవేసిన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగా. తన లేటెస్ట్ మూవీ యానిమల్ విడుదలకు సిద్ధమైంది.