జోరు పెంచిన నాగార్జున.. వరసగా సినిమాలతో బిజీ అయిపోయిన మన్మధుడు

| Edited By: Phani CH

Dec 06, 2023 | 4:45 PM

హిట్టు ఫ్లాపులతో పనేం లేదు.. వరసగా సినిమాలు చేస్తున్నామా లేదా అనేది మాత్రమే కొందరు హీరోలు మెంటల్‌గా ఫిక్సైపోయి ఉంటారు. ఈ లిస్టులోకి లేటెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు నాగార్జున. నిన్నమొన్నటి వరకు నిదానమే ప్రధానం అన్నట్లున్న నాగ్.. ఒక్కసారిగా జోరు పెంచేసారు. ఇటు బుల్లితెర.. అటు వెండితెరపై రప్ఫాడిస్తున్నారు ఈ సీనియర్ హీరో. ఈ స్పీడ్‌కు రీజన్ ఏంటి..? కారణం తెలియదు కానీ.. చాలా రోజుల తర్వాత నాగార్జున జోరు పెంచేసారు. మొన్నటి వరకు ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయని ఈయన..

1 / 5
హిట్టు ఫ్లాపులతో పనేం లేదు.. వరసగా సినిమాలు చేస్తున్నామా లేదా అనేది మాత్రమే కొందరు హీరోలు మెంటల్‌గా ఫిక్సైపోయి ఉంటారు. ఈ లిస్టులోకి లేటెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు నాగార్జున. నిన్నమొన్నటి వరకు నిదానమే ప్రధానం అన్నట్లున్న నాగ్.. ఒక్కసారిగా జోరు పెంచేసారు. ఇటు బుల్లితెర.. అటు వెండితెరపై రప్ఫాడిస్తున్నారు ఈ సీనియర్ హీరో. ఈ స్పీడ్‌కు రీజన్ ఏంటి..?

2 / 5
కారణం తెలియదు కానీ.. చాలా రోజుల తర్వాత నాగార్జున జోరు పెంచేసారు. మొన్నటి వరకు ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయని ఈయన.. ఉన్నట్లుండి ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ అయిపోయారు. సినిమాలతో పాటు బిగ్ బాస్‌తోనూ బిజీగానే ఉన్నారు నాగ్. సంక్రాంతికి రావాలని ఫిక్సయ్యాక.. మూన్నెళ్లలోనే నా సామిరంగా పూర్తి చేస్తున్నారు నాగార్జున.

3 / 5
విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్న నా సామిరంగా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం ఖాయం. మరోవైపు శేఖ‌ర్ క‌మ్ముల, ధ‌నుష్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అనిల్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేసారు నాగ్. దీని వర్క్ కూడా వేగంగా జరుగుతుంది.

4 / 5
తమిళంలో విజ‌య్ ఆంటోనీతో ఓ సినిమా చేసారు అనిల్. ఇప్పుడు నాగ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. జ్ఞాన‌వేల్ రాజా నిర్మించనున్న ఈ సినిమాకు LAR అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

5 / 5
అంటే ల‌వ్ యాక్షన్ రొమాన్స్ అని అర్థం. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమాతోనే పాన్ ఇండియన్ పాస్ తీసుకోబోతున్నారు నాగార్జున. మొత్తానికి 60 ప్లస్‌లో వరస ప్రాజెక్ట్స్‌తో టాప్ గేర్ వేసారు నాగార్జున.