Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్..!.. అకీరా ఎంట్రీ ఎప్పుడు..?

Edited By: Phani CH

Updated on: Mar 18, 2025 | 9:38 PM

పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారా..? జనసేన 11వ ఆవిర్భావ సభలో ఈ విషయం చెప్పకనే చెప్పారా..? పవర్ స్టార్‌కు ఓజి చివరి సినిమా కాబోతుందా..? ఉస్తాద్ భగత్ సింగ్‌పై సైతం ఫ్యాన్స్ ఆశలు వదిలేయాల్సిందేనా..? ఒకవేళ ఇదే నిజమైతే అకీరా నందన్ అరంగేట్రానికి సమయం ఆసన్నమైనట్లేనా..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

1 / 5
పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆయన నుంచి సినిమాలు రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు.. ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలంటూ కోరుతున్నారు.

2 / 5
అందుకే ఆయనెక్కడ కనిపించినా.. ఓజి ఓజి అంటూ అరుస్తున్నారు. దీంతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కమిటయ్యారు పవన్. నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

3 / 5
నాలుగేళ్ల తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అంటూ వచ్చారు. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే చేసారు. అదే సమయంలో ఉస్తాద్‌తో పాటు వీరమల్లు, ఓజికి కమిటయ్యారు. ఇందులో ఓజి షూట్ చివరిదశకు వచ్చింది.. మరో రెండు వారాలు డేట్స్ ఇస్తే చాలు.

4 / 5
హరిహర వీరమల్లు మే 9న విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఆ వెంటనే కాస్త వీలు చూసుకుని ఓజికి కూడా డేట్స్ ఇస్తానంటున్నారు పవర్ స్టార్. ఈ రెండూ పూర్తయ్యాక ఉస్తాద్ ఉండటం అనుమానమే. పవన్ ఉన్న బిజీకి ఈ సినిమా పూర్తి చేయడం కష్టమే. పైగా పవన్‌కు సినిమాలపై ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదనే విషయం అర్థమవుతుంది.

5 / 5
పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్నిబట్టి ఓజి ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే అకీరా నందన్ అరంగేట్రానికి కూడా సమయం ఆసన్నమైనట్లే. అందుకే ఈ మధ్య తనయుడిని ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేనాటికి.. వారసుడిని సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.