
సినిమా హీరోయిన్స్ కు కొన్ని సార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును వెంబడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిమిషా .

నిమిషా నాయర్ తన స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి వారిని వెంబడించి వేధించాడు. ఆమె కారులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి తగినట్టు ఉన్నాడు. మా కారు ముందు బైక్ ఆపి పిచ్చి పిచ్చిగా వాగారు. నా కారు డోరు తీయడని ప్రయతించారు. నన్ను విండో కిందికి దించామని వేధించారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది నిమిషా.

ఈ ఊహించని సంఘటనతో నిమిషా నాయర్ భయపడి వెళ్ళిపోకుండా, నిమిషా ఆ వ్యక్తిని అక్కడికక్కడే నిలదీసింది. కారులో ఉండే నిమిషా తన ఫోన్‌తో ఆ వ్యక్తి చేస్తున్న పనిని వీడియో తీసింది. ఆ వీడియోలో సదరు వ్యక్తి తన తప్పును దాచుకునే ప్రయత్నం చేస్తూ, తిరిగి ఆమెతోనే వాదనకు దిగడం కనిపించింది.

ఈ వేధింపుల వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, మహిళల భద్రత గురించి ఆవేదన వ్యక్తం చేసింది. మనం ఎంత కాలం ఇలాంటివి భరించాలి.? అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. తనను వేధిస్తున్న వ్యక్తిని సాక్ష్యంతో సహా పట్టుకోవడంపై చాలా మంది ఆమెను అభినందించారు. ఇక నిమిషా నాయర్ పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది.