Megastar Chiranjeevi: చిరంజీవి హెల్త్ డైట్ ఇదే.. రోజూ ఇదే తింటారు.. చిరు ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన నటుడు హర్షవర్దన్..

Updated on: Jun 25, 2026 | 7:13 PM

నటుడు హర్షవర్ధన్, మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన ఫిట్‌నెస్, ఆహార నియమాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా, ఆయన తన శరీరంపై అసాధారణమైన నియంత్రణను కలిగి ఉంటారని, పరిమిత ఆహారం, నిరంతర వ్యాయామంతో ఆదర్శంగా నిలుస్తారని వివరించారు. ఈ క్రమశిక్షణే చిరంజీవి అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కారణమని తెలిపారు.

1 / 5
తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా నటుడిగా, రచయితగా తనదైన ముద్ర వేసిన హర్షవర్ధన్, ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన ఫిట్‌నెస్, ఆహార నియమాలపై విషయాలను పంచుకున్నారు. చిరంజీవి తాజా లుక్ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని, ఈ మార్పు వెనుక ఉన్న క్రమశిక్షణ గురించి వివరించారు. చిరంజీవి తన శరీరంపై అసాధారణమైన పట్టు సాధించారు. ఇది కేవలం ఇటీవల కాలంలో వచ్చిన మార్పు కాదని, ఆయన సినీ కెరీర్ ఆరంభం నుంచే ఈ క్రమశిక్షణను ప్రదర్శించారని హర్షవర్ధన్ గుర్తు చేశారు.

2 / 5
"యమకింకరుడు" సినిమాలో వెనుక నుంచి వేసే సోమర్‌సాల్ట్‌లు, "ఎముడికి మొగుడు" వంటి చిత్రాల్లోని పాటల్లో అద్భుతమైన డ్యాన్స్ కదలికలు చిరంజీవి శరీర నియంత్రణకు నిదర్శనాలని అన్నారు. ఈ గ్రేస్, పట్టుదల లేకపోతే అలాంటి కదలికలు అసాధ్యమని హర్షవర్ధన్ చెప్పారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి కొంతకాలం పాటు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించలేకపోయారని, ఆ సమయంలో ఆయన కాస్త బరువు పెరిగినట్లు కనిపించారని హర్షవర్ధన్ అన్నారు.

3 / 5
అయితే, తిరిగి సినిమాల్లోకి వచ్చినప్పుడు, ఆయన ఎటువంటి రాజీ లేకుండా పూర్తి అంకితభావంతో తన రూపాన్ని తిరిగి పొందారని తెలిపారు. "విశ్వంభర" వంటి చిత్రాలకు ముందు, షూటింగ్ సెట్‌కు వచ్చినప్పుడు చిరంజీవిని చూసి తాను షాక్ అయినట్లు హర్షవర్ధన్ తెలిపారు. పదునైన లుక్, చెక్కుచెదరని ఫిట్‌నెస్‌తో ఆయన తన వయస్సును దాచుకోగలిగారని వివరించారు.

4 / 5
చిరంజీవి ఆహార నియమాల గురించి హర్షవర్ధన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సెట్‌లో చిరంజీవితో కలిసి భోజనం చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, చిరంజీవి ఇంట్లో నుంచి రుచికరమైన ఆహారం వచ్చినా, ఆయన చాలా పరిమితంగా, క్రమశిక్షణతో తీసుకుంటారని చెప్పారు. "నేను నా పప్పు అన్నం ముగించేలోపు, ఆయన పెరుగు అన్నం కూడా అయిపోయింది" అని అన్నారు. ఆ సీన్ చిరంజీవికి తన ఆహారంపై ఎంత నియంత్రణ ఉందో తెలియజేస్తుందని అన్నారు.

5 / 5
కేవలం ఆహారం విషయంలోనే కాకుండా, వ్యాయామం విషయంలో కూడా ఆయన అంతే కట్టుబడి ఉంటారని, షూటింగ్ రద్దయిన రోజుల్లో కూడా అదనపు సమయాన్ని వ్యాయామం కోసం కేటాయిస్తారని హర్షవర్ధన్ పేర్కొన్నారు.  చిరంజీవి ఈ అంకితభావం, క్రమశిక్షణ తనపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయని హర్షవర్ధన్ తెలిపారు. తాను కూడా తన ప్రస్తుత లుక్‌తో కొంత విసుగు చెందానని, చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే మూడు నెలల్లో ఒక "సర్ప్రైజింగ్ లుక్"తో ప్రేక్షకులను అలరించడానికి కృషి చేస్తానని వెల్లడించారు.

Follow Us