Dasara Movies: 10 రోజుల తర్వాత దసరా సినిమాల పరిస్థితి ఏంటి.. ఏది హిట్టు.. ఏది ఫట్..?

| Edited By: Prudvi Battula

Nov 01, 2023 | 3:29 PM

దసరాకు అనుకున్నట్టుగానే మూడు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో అందరూ ఊహించినట్టుగానే బాలయ్య సినిమా అగ్ర తాంబూలం తీసుకుంది. భగవంత్ కేసరి ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తూనే ఉంది. పది రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ బానే వస్తున్నాయి. రెండో వీకెండ్ సైతం మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది భగవంత్ కేసరి.

1 / 5

2 / 5
కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఎక్కడా పెద్దగా డ్రాప్స్ కనిపించడం లేదు. 11 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 63 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. 67 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బాలయ్య సినిమా. ఈ లెక్కన 70 కోట్లు వస్తే సినిమా హిట్. అంటే మరో ఏడు కోట్ల దూరంలో ఉంది భగవంత్ కేసరి.

3 / 5
ఈ వారం కూడా సినిమాలేమీ లేవు. కొన్ని విడుదలైనా వాటి గురించి జనాలకు తెలియదు. కాబట్టి భగవంత్ కేసరి వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ తీసుకొస్తే బాలయ్య ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయం.

4 / 5
ఇక అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వరరావు నిరాశ పరిచింది. దసరా సినిమాల్లో అన్నింటికంటే తక్కువ కలెక్షన్స్ వచ్చింది ఈ సినిమాకే. ప్రతిసారి బాలయ్యతో పోటీ పడినప్పుడు విజయం రవితేజను వరిస్తే.. ఈసారి సీల్ రివర్స్ అయింది. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన టైగర్ నాగేశ్వరరావు ఇప్పటివరకు 23 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

5 / 5
దసరా సినిమాలలో టాక్ తో సంబంధం లేకుండా దంచి కొట్టింది లియో. విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే దాదాపు 9 కోట్ల షేర్ తీసుకురావడంతో పని సులువుగా మారిపోయింది. రూ. 16 కోట్లకు తెలుగు రాష్ట్రాల హక్కులను కొంటే.. ఇప్పటికే 11 రోజుల్లో 24 కోట్ల షేర్ తీసుకొచ్చింది. దసరా సినిమాల్లో క్లీన్ హిట్ గా నిలిచింది లియో. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే.. రవితేజ మాత్రమే రీస్ లో వెనుకబడ్డాడు. మిగిలిన రెండు సినిమాలు బాగానే ఉన్నాయి.