డబ్బును చూసి గర్వపడుతున్నారా..? ఇలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు

Updated on: Oct 16, 2026 | 11:24 AM

చాణక్యుడి ఈ నీతి సూత్రాలు ధనవంతులు కావాలనుకునే వారికి మార్గదర్శకం. నిజాయితీగా డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం, ధర్మకార్యాలకు ఖర్చు చేయడం, అహాన్ని వీడటం ద్వారా జీవితంలో ధన సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. కష్టపడి సంపాదించిన సంపద శాశ్వతంగా నిలుస్తుందని.. చాణక్యనీతి చెబుతోంది.

1 / 5
భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడైన రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త, తత్వవేత్త, పండితుడు ఆచార్య చాణక్యుడు.. అందుకే ఆయన్ను కౌటిల్యుడు అని పిలుస్తారు. ఆయన చాణక్యనీతిలో ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు చెప్పినట్టుగా పొదుపు చేసిన డబ్బు అవసరాల్లో మనకు అండగా నిలుస్తుంది.  జీవితంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ధనవంతులు కావాలనుకునే వారు ఆయన మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పురాణ గ్రంథాలతో పాటు చాణక్యనీతి సైతం డబ్బు ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి.

2 / 5
డబ్బు సంపాదించడం, సంపదను కాపాడుకోవడం గురించి చాణక్యుడు విలువైన సూచనలను అందించాడు. ఈ సూచనలను అనుసరించే వ్యక్తులు ఎప్పటికీ పేదరికంలోకి జారుకోరు. సంపదను కాపాడుకోవడానికి ఖర్చు చేసే విధానం కూడా చాలా ముఖ్యం. ధర్మ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయడం వల్ల ధనం తరగదు, పైగా పెరుగుతుంది.

3 / 5
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత డబ్బును పొదుపు చేయాలి. దుబారా ఖర్చును మానుకోవాలి.. దానం చేయడం, మతపరమైన కార్యక్రమాలకు డబ్బును ఖర్చు చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. అయితే.. కష్ట సమయాల్లో డబ్బు ఆదా చేయడం ఒక పెట్టుబడిగా పనిచేస్తుంది.

4 / 5
డబ్బును ఎల్లప్పుడూ నైతికంగా, సరైన పద్ధతిలో సంపాదించాలి. అబద్ధం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు త్వరలోనే బహిర్గతం అవుతారు. కష్టపడి, నిజాయితీగా డబ్బు సంపాదించడం ముఖ్యం.. అందుకే, అనైతికంగా సాంపాదించిన డబ్బు నిలవదని చెప్పాడు..

5 / 5
సంపద గురించి గర్వపడకూడదు.. అహాన్ని వీడి వినయం, విలువలు, సంపదల పట్ల గౌరవం కలిగి ఉండాలి. నిజాయితీగా సంపాదించిన డబ్బు మీకు శాశ్వతంగా ఉంటుంది. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలబడదు. నిజాయితీగా కష్టపడి సంపాదించిన ఆస్తి, సంపద ఎల్లప్పుడూ ఒక వ్యక్తికి సహాయం చేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us