దీపావళి నాటికి బంగారం ధరలు మరింత తగ్గుతాయా? కొనేందుకు ఇదే బెస్ట్ టైమా?

Updated on: Oct 22, 2026 | 1:14 PM

Diwali 2026 Gold Rate Forecast: దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ బలం, క్రూడాయిల్ ధరలు, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మరి దీపావళి నాటికి ధరలు ఇంకా తగ్గుతాయా? కొనుగోలు చేసేవారు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?

1 / 6
దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరల తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. సాధారణంగా ధన త్రయోదశి, దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి కొనుగోళ్లు పెరుగుతాయి. దీంతో బంగారం ధరలు కూడా మిగిలిన మాసాలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉండేవి. అయితే ఈసారి దీపావళి పండుగకు ముందు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. మరి పండుగ వేళ ధరలు తగ్గడానికి కారణాలేంటి? ఈ తగ్గుదల మరికొంతకాలం కొనసాగుతుందా?

2 / 6
బంగారం ధరలపై అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చనే అంచనాలు పసిడిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. బంగారంపై చేసే పెట్టుబడులపై వడ్డీ రూపంలో ఆదాయం లభించదు. అదే సమయంలో అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరిగితే పెట్టుబడిదారులు బంగారానికి బదులుగా వాటివైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. దీంతో పసిడికి డిమాండ్ తగ్గి ధరలు మరింత పడిపోయే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గితే అది భారత మార్కెట్‌పైనా ప్రభావం చూపుతుంది. అక్టోబర్ 22న అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,085 డాలర్ల స్థాయికి పడిపోయినట్లు రాయిటర్స్ నివేదించింది. వెండి ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. భారత బులియన్ మార్కెట్‌లో 2026 అక్టోబర్ 22న 22 క్యారెట్ల గ్రాము బంగారంపై రూ.155లు తగ్గి రూ.13,235గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.170 తగ్గి రూ.14,438గా ఉంది. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఒకేరోజు ఏకంగా రూ.1,700 తగ్గింది.

3 / 6
అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు క్రూడాయిల్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరగడంతోపాటు ద్రవ్యోల్బణ భయాలు కూడా అధికమవుతాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గించకపోవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. అధిక వడ్డీ రేట్ల పరిస్థితి బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని పెట్టుబడులకు ప్రతికూలంగా మారుతుంది.

4 / 6
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం లావాదేవీలు ప్రధానంగా అమెరికన్ డాలర్లలో జరుగుతాయి. డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల అంతర్జాతీయ డిమాండ్‌పై ఒత్తిడి ఏర్పడే అవకాశముంది. భారత్‌లో బంగారం ధరలు నిర్ణయించడంలో రూపాయి మారకం విలువ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రూపాయి బలపడితే దిగుమతి చేసుకునే బంగారం ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 21న రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన ధోరణి కలిసి దేశీయ బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపినట్లు పీటీఐ నివేదించింది.

5 / 6
బంగారం ధరలు గతంలో గణనీయంగా పెరిగినప్పుడు తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కొందరు పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించేందుకు విక్రయాలు చేపడతారు. ఒకేసారి విక్రయాలు పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల సవరణకు ఈ లాభాల స్వీకరణ కూడా ఒక కారణం కావచ్చు. దీపావళి సమీపిస్తున్నందున ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని లేదా తగ్గుతాయని చెప్పలేం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ కదలికలు, చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తాయి. పండుగ సీజన్‌తో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారత్‌లో డిమాండ్ పెరగడం తత్కాలికంగా ధరలకు కొంత మేర మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది.

6 / 6
బంగారం కొనాలనుకునేవారు ఒకరోజు ధర తగ్గిందని మాత్రమే నిర్ణయం తీసుకోకుండా, తమ అవసరాలు, బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛత, హాల్‌మార్క్, తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ధరల తగ్గుదల కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా, భవిష్యత్తులో ధరలు ఎలా మారతాయో ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు.

Loading...
Unable to load recommendations.
Follow Us