EV Cars: మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ ఈవీ కార్లు ఇవే.. ఫీచర్ల విషయంలో వీటికి సాటిలేవంతే..!

|

Sep 25, 2023 | 9:00 AM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజాదరణతో పెరుగుతుంది. వాహన నిర్వహణతో పాటు పర్యావరణ అనుకూలమైన వాహనాలు కావడంతో ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు. అయితే భారత మార్కెట్‌లో ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఫోర్‌ వీలర్స్‌ అంతపెద్దగా ఆకట్టుకోలేదు. అయితే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో మార్కెట్‌లో ఇటీవల కాలంలో ఈవీ కార్లు కూడా తమ హవా చూపుతున్నారు. ముఖ్యంగా పెట్రో, డిజీల్‌ వాహనాలతో సమానంగా ప్రత్యేక ఫీచర్లతో పాటు అదిరిపోయే మైలేజ్‌ను అందిస్తున్నాయి. కాబట్టి 2023లో భారతదేశంలో అత్యంత బడ్జెట్ స్నేహపూర్వకంగా ఉండే ఎలక్ట్రిక్‌ కార్ల గురించి తెలుసుకుందాం.

1 / 5
టాటా నెక్సాన్‌ ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్‌లలో లభ్యమవుతుంది. ఇది పవర్, రేంజ్ అద్భుతమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. మీడియం రేంజ్ 30 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 127 బీహెచ్‌పీ మోటారును కలిగి ఉంది. దీంతో ఈ కారు 325 కిలోమీటర్ల పరిధిని సాధిస్తుంది. అయితే లాంగ్ రేంజ్ విషయానికి వస్తే 40.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 142 బీహెచ్‌పీ మోటార్‌తో వస్తుంది. ఈ కారు రేంజ్‌ 465 కిమీ పరిధిని అందిస్తుంది. నెక్సాన్‌ ఈవీ దాని విశాలమైన క్యాబిన్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్, ఆకర్షించే డిజైన్ కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కారు ధర కూడా రూ.14.74 లక్షల నుంచి రూ.19.94 లక్షల మధ్య ఉంటుంది.

2 / 5
సిట్రియోన్‌ ఈసీ3 కారు రూ.11.50 లక్షల నుంచి రూ.12.43 లక్షల ధరల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంఉటంది. ఈ కారు 29.2 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 56 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారుతో రావడం వల్ల 320 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, చక్కగా అమర్చిన ఇంటీరియర్, అద్భుతమైన సౌలభ్యం సరసమైన ఈవీ సెగ్మెంట్‌లో మంచి ఎంపికగా నిలుస్తుంది.

3 / 5
మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను అందిస్తుంది. మీడియం రేంజ్‌లో 19.2 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 60 బీహెచ్‌పీ మోటారు 250 కిమీ పరిధితో వస్తుంది. అయితే లాంగ్ రేంజ్ 24 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 74 బీహెచ్‌పీ మోటార్‌తో ఆకట్టుకునే 315 కిలోమీటర్ల పరిధిని అందిస్తోంది. ప్రశంసనీయమైన శ్రేణితో పాటు, ఇది విస్తారమైన స్థలాన్ని, ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారు ధర రూ.8.49 లక్షల నుంచి రూ.12.04 లక్షల మధ్య ఉంటుంది.

4 / 5
ఎంజీ కామెట్ ఈవీ భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన ప్రయాణీకుల ఈవీగా నిలుస్తుంది. 17.3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 42 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారుతో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిమీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. కామెట్ కాంపాక్ట్ కొలతలు పట్టణాల్లో రైడ్స్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ కారు ఇంటర్నల్‌ స్పేస్‌ మాత్రం పరిమితంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.7.9 లక్షల నుంచి రూ.9.9 లక్షల మధ్య ఉంటుంది.

5 / 5
టాటా టిగోర్‌ ఈవీ 26 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, 74 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. టాటా టిగోర్ ఈవీ 315 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ కారు విస్తారమైన క్యాబిన్, బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది రోజువారీ ఉపయోగం కోసం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.12.49 లక్షల నుంచి రూ.13.75 లక్షల ధరల మధ్య ఉంటుంది.