Indian Railways: ట్రైన్ టికెట్ రద్దు చేసుకునేవారికి కొత్త రూల్స్.. ఆ టైమ్‌లో క్యాన్సిల్ చేస్తే నో రీఫండ్.. షాకింగ్ డెసిషన్..

Updated on: Mar 29, 2026 | 7:38 PM

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ట్రైన్ టికెట్ రద్దు చేసుకునే సమయంలో ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఇప్పటివరకు ఉన్న టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలను రైల్వేశాఖ మార్చింది. వీటి వివరాలు ఏంటో ఇందులో చూద్దాం.

1 / 5
ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైళ్లల్లో ప్రయాణించాలనుకునేవారు ముందుగానే ఆన్‌లైన్లో టికెట్ బుకింగ్ చేసుకుంటారు. ఐఆర్‌సీటీసీ లాగిన్ డీటైల్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే కొన్నిసార్లు చివరి నిమిషంలో ప్రయాణం రద్దు అయినప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారు.

2 / 5
ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు రీఫండ్ అందుతుంది. అయితే మీరు ట్రైన్ బయల్దేరడానికి ఎన్ని గంటల ముందు క్యాన్సిల్ చేశారనే దాని బట్టి రీఫండ్ అందుతుంది. ఇందుకోసం కొన్ని క్యాన్సిలేషన్ రూల్స్‌ను ఐఆర్‌సీటీసీ పాటిస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఈ రూల్స్‌ ఏప్రిల్ 1 నుంచి మారనున్నాయి. కొత్త నియమాలు ఏంటో ఇందులో తెలుసుకుందాం.

3 / 5
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలను రైల్వేశాఖ వర్తింపచేయనుంది. ఇక నుంచి ట్రైన్ బయల్దేరడానికి 8 గంటల ముందు రద్దు చేస్తే రీఫండ్ ఒక్కరూపాయి కూడా రాదు. గతంలో ఈ సమయం నాలుగు గంటలుగా ఉండగా.. ఇప్పుడు 8 గంటలకు పెంచారు. ఇక రైలు బయల్దేరే సమయానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య క్యాన్సిల్ చేసుకుంటే 50 శాతం మాత్రమే రీఫండ్ అందుతుంది.

4 / 5
అలాగే 72 నుంచి 24 గంటల మధ్య టికెట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే 25 శాతం కొత విధించి మిగలినది వేస్తారు. ఇక 72 గంటల ముందే క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్  ఛార్జీలు కొంత మొత్తం కట్ అయి మిగిలిన సొమ్ము రీఫండ్ చేస్తారు. వీటి గురించి ప్రయాణికులు తెలుసుకోవాలని అధికారులు సూచించారు

5 / 5
ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15 తేదీ మధ్య దశలవారీగా ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురానున్నారు. ఇక నుంచి ఏ స్టేషన్ నుంచి అయినా టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. గతంలో బోర్డింగ్ పాయింట్ నుంచి మాత్రమే రద్దు చేసుకునే అవకాశం ఉండేది. ఇక బోర్డింగ్ పాయింట్‌ను 30 నిమిషాల ముందు మార్చుకునేలా అవకాశం కల్పించనున్నారు

Follow Us