PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్ అప్డేట్.. రైతుల అకౌంట్లోకి జమ అయ్యేది అప్పుడే.. కేంద్రం నుంచి క్లారిటీ

Updated on: Mar 08, 2026 | 12:31 PM

పీఎం కిసాన్ సాయం కోసం చూస్తున్నారా..? రూ.2 వేలు ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని అనుకుంటున్నారా..? గత ఏడాది నవంబర్‌లో 21వ విడత నగదు జమ కాగా.. 22వ విడత ఎప్పుడు పడతాయా అని రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది.

1 / 5
పీఎం కిసాన్‌పై బిగ్ అప్డేట్ అందింది. మార్చి నెలాఖరు నాటికి ఖచ్చితంగా కేంద్రం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందని తెలుస్తోంది. 22వ విడత కింద రూ.2 వేలను ప్రభుత్వం రైతులకు బదిలీ చేయనుంది. కేంద్రం అధికారికంగా ఇంకా తేదీని ప్రకటించనప్పటికీ.. ఫిబ్రవరిలో జమ చేయాల్సి ఉండగా ఆలస్యం కావడంతో మార్చిలో తప్పనిసరిగా పడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

2 / 5
ప్రతీ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. కానీ లబ్దిదారుల రీవెరిఫికేషన్ డ్రైవ్ కేంద్రం చేపడుతోంది. కొంతమందికి అర్హత లేకపోయినా వివిధ అక్రమ మార్గాల్లో నగదు పొందుతున్నారు. దీంతో అనర్హులను తొలగించేందుకు కేంద్రం పున:పరిశీలన చేపడుతోంది. ఇటీవల కొంతమంది అనర్హులుగా తేలడంతో వారిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించింది.

3 / 5
ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధుల ఆలస్యం కావడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ నిధులు అందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. డీబీటీ విధానంలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి ఉండాలి.

4 / 5
పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్ నెంబర్, ఓటీపీ ఉపయోగించి కేవైసీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక సీఎస్‌పీ కేంద్రాలు, బ్యాంకులకు వెళ్లి కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక 14 రాష్ట్రాల్లో ఫార్మార్ ఐడీ కూడా తప్పసరిగా ఉండాలనే నిబంధన కేంద్రం విధించింది. ఈ రిజిస్ట్రేషన్ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్ నిధులు అందుతాయి.

5 / 5
ఏపీ, అస్సాం, గుజరాత్, బీహార్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్ట్రీని కేంద్రం ప్రారంభించింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఓ యూనిక్ ఐడీ జనరేట్ అవుతుంది. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందటంలో ఇది సహాయపడుతుంది

Follow Us