PM Kisan: కేవైసీ ఒక్కటే కాదు.. ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..

Updated on: Oct 25, 2026 | 2:23 PM

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త అందించింది. ఈ నెల 30వ తేదీన పీఎం కిసాన్ 24వ విడత సాయం విడుదల చేయనుంది. అయితే కేవైసీ ప్రక్రియ ఒక్కటి పూర్తి చేస్తే నగదు అందుతాయోమోనని చాలామంది అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు.. ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాలి.

1 / 5
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 30వ తేదీన పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న నగదు దీపావళికి ముందే రానున్నాయి. దీంతో రైతులు రెట్టింపు ఆనందంలో ఉన్నారు. అయితే నిజమైన లబ్దిదారులకే నగదు ప్రయోజనం అందించేందుకు, నకిలీ లబ్దిదారులను తొలగించేందుకు కేంద్రం పీఎం కిసాన్ లబ్దిదారులకు కేవైసీ తప్పనిసరి చేసింది.

2 / 5
ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే నగదు అందవు. మళ్లీ పీఎం కిసాన్ కేవైసీ పూర్తి చేస్తేనే నిధులు అందుతాయి. దీంతో లబ్దిదారులు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా మొబైల్ ద్వారా సులువుగా పూర్తి చేసుకోవచ్చు. ఇక మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా కూడా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

3 / 5
అయితే కేవైసీ పూర్తి చేయడం ఒక్కటే కాదు. పీఎం కిసాన్ అందుకోవాలంటే ఇంకా కొన్ని పనులు చేయాలి. అదేంటంటే. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. దీంతో పాటు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసి ఉండాలి. బ్యాంక్ సీడింగ్ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే పీఎం కిసాన్ సాయం మీ అకౌంట్లో జమ కావు. దీంతో బ్యాంకుల ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచులను సంప్రదించి అయినా ఈ పని చేసుకోవచ్చు.

4 / 5
అలాగే భూమి రికార్డులు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి మీ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. భూమి రికార్డులు సీడింగ్ అయ్యాయా.. లేదా అనేది అక్కడ కనిపిస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మార్చుకోవాలి. వివరాల్లో తప్పులు ఉన్నాయో.. లేదో తనిఖీ చేసుకోండి.

5 / 5
అలాగే ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదై ఉండాలి. మీరు ఈ పనులన్నీ పూర్తి చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా పీఎం కిసాన్ సాయం పొందవచ్చు. ఇంకా మీరు పూర్తి చేయకపోతే వెంటనే ఈ పనులు పూర్తి చేసుకోండి. దీని వల్ల మీకు ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us