Petrol Prices: లీటర్ పెట్రోల్ కేవలం 25 పైసలే.. ఎక్కడో కాదండోయ్.. మన దేశంలోనే..

Updated on: Oct 23, 2026 | 6:54 PM

ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థతుల ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో కేంద్రం ఇంధన ధరలను పెంచేసింది. దీంతో నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.

1 / 5
2010 నుంచి మార్కెట్ ధరల ఆధారంగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంది. అంటే అంతర్జాతీయ ఉత్పత్తి ధరలు, రూపాయి విలువ, ట్యాక్సులు, ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఇంధన ధరలను నిర్ణయిస్తుంది. ఇక రాష్ట్రాలు భారీగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక ట్యాక్సులు, సుంకాలు విధించడం కూడా ధరలను పెంచుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్లు ఉన్నాయి.

2 / 5
ప్రస్తుతం 2026 నాటికి లీటర్ పెట్రోల్ రూ.100 పలుకుతోంది. దీనిని చూసుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు క్రమక్రమంగా భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ముడి చమురు  ధరలేనని నిపుణులు చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ, ట్యాక్సులు, రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, దేశీయంగా అమలు చేస్తున్న విధానం ధరలను నిర్ణయిస్తుంది.

3 / 5
అయితే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.25 పైసలు నుంచి 0.27 పైసలుగా ఉంది. ఆ తర్వాత నుంచి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. 1970లో 0.90 పైసలు, 1990లో లీటర్ పెట్రోల్ రూ.4 నుంచి రూ.5 వరకు ఉంది. ఆ తర్వాత 2004లో లీటర్ రూ.33 నుంచి రూ.34 మధ్య ఉండగా.. 2010 నాటికి రూ.50  నుంచి రూ.55గా ఉన్నాయి.

4 / 5
ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల దేశంలో ఇంధన ధరలను కేంద్రం పెంచింది. దశలవారీగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెంచింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధరలు రూ.100 నుంచి రూ.110 మధ్య ఉండగా.. డీజిల్ ధరలు రూ.95 నుంచి రూ.105 మధ్య లభిస్తున్నాయి. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. దీనికి కారణం రాష్ట్రాలు విధించే ప్రత్యేక ట్యాక్సులు, సెస్‌లు కారణంగా చెప్పవచ్చు.

5 / 5
పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నివసించే ప్రతీఒక్కరినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. వీటి ధరలు నిత్యావసర సరుకులతో పాటు ప్రయాణ ఖర్చులపై నేరుగా ప్రభావితం చూపిస్తాయి. దీంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. ఇక వ్యాపారులపై కూడా  నేరుగా ప్రభావం పడుతుంది. ఈ కారణంతో పెట్రోల్, డీజిల్ ఒక్క రూపాయి పెరిగినా అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us