
Ration Card: దేశంలో ఉన్న కోట్లాది మంది రేషన్‌కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ విషయంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సార్థక్ పీడీఎస్ అనే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా టెక్నాలజీ పరంగా రేషన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు.

సార్థక్ పీడీఎస్ పథకం ఏంటి?: కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పథకం గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రధానంగా రేషన్ బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు పక్కదారి పట్టకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దీని అమలు కోసం కేంద్ర సర్కార్ రూ.25,530 కోట్లు ప్రకటించింది. రానున్న ఐదు సంవత్సరాల పాటు ఈ నిధులు పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి ఉపయోగించనున్నారు.

రియల్ టైం మానిటరింగ్: ఈ పథకంలో భాగంగా రియల్ టైమ్ మానిటరింగ్, బయో మెట్రిక్ ధృవీకరణ వంటి వాటిపై ఫోకస్ పెట్టనుంది. గోదాముల నుండి చౌక ధరల దుకాణాల (FPS) వరకు ధాన్యం ఎలా వెళ్తోంది? రేషన్ సరుకులు ఎంత మంది పొందుతున్నారనేదానిపై కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. దీనికోసం ప్రత్యేక అప్లికేషన్‌ను తీసుకురానున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణను మరింత బలోపేతం చేయనుంది. ఈ విధానం వల్ల నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది.

ఇక కొత్త దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభం: రేషన్ రవాణా, గిడ్డంగుల నిర్వహణ, డీలర్ల మార్జిన్ వంటి ఖర్చులను ఈ పథకం ద్వారా కేంద్రమే భరిస్తుంది. తద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. అలాగే కొత్త దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇకపై మరింత సులతరం చేయనుంది. లబ్దిదారులకు రేషన్ సరిగ్గా పంపిణీ అవుతుందా? లేదా అనే విషయాలపై ఆన్‌లైన్‌లో పర్యవేక్షించన్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ విధంగా రేషన్ కార్డుల్లో అక్రమాలు, పంపిణీలో పారదర్శకం ఉండే విధంగా కేంద్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ మొత్తం ప్రక్రియ టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించనుంది. ఇప్పటికే నకలీ రేషన్ కార్డులు, రేషన్ పక్కదారి పట్టడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.