Gold: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Updated on: Sep 12, 2026 | 11:09 AM

దేశంలో బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. నిన్న ధరలు పడిపోగా.. ఇవాళ మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలే దీనికి కారణంగా చెప్పవచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ కారణంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

1 / 5
దేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఒకరోజు తగ్గుతుండగా.. మరో రోజు పెరుగుతూ అస్థిరతకు దారితీస్తున్నాయి. దీంతో ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బిజినెస్ అనలిస్టులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వారం ప్రారంభంలో తగ్గగా.. చివరికి పెరుగుదలను నమోదు చేశాయి. సెప్టెంబర్ 12న ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

2 / 5
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,800 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.160 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,41,700గా ఉండగా.. నేడు రూ.150 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,730 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,850గా ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది.

4 / 5
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,700కు లభిస్తోంది. ముంబైలో కూడా 24 క్యారెట్లు రూ.1,54,580గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,41,700 వద్ద ట్రేడవుతోంది.

5 / 5
అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us