Gold Prices: ఇదే జాక్ పాట్ ఛాన్స్.. బంగారం కొనాలనుకునేవారికి బంపర్ అవకాశం.. దీపావళికి ముందే కొనేయండి..

Updated on: Oct 21, 2026 | 5:22 PM

త్వరలో దీపావళి వస్తుండటంతో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం కొనుగోళ్లు పెరగనున్నాయి. అంతేాకాకుండా దీపావళి వస్తుండటంతో బంగారం కొంటే శుభం జరుగుతుందని చాలామంది భావిస్తారు. ఈ క్రమంలో దీపావళికి ముందే బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

1 / 5
బంగారం ధరలు కొన్ని నెలలుగా డౌన్ అవుతున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం, డిమాండ్ పెద్దగా లేకవపోడంతో ధరలు దిగొస్తున్నాయి. గత నెల రోజుల్లో ఏకంగా 5 శాతంకిపైగా ధరలు పడిపోయాయి. త్వరలో దీపావళి పండుగ వస్తుండటం, పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలుకానున్న క్రమంలో డిమాండ్ దృష్ణా ధరలు ఎగబాకే అవకాశముందనే అంచనాలు ఆర్ధిక విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

2 / 5
ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్న క్రమంలో కొనాలనుకునేవారికి ఇదే సువర్ణవకాశంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలని భావిస్తున్నవారు ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయనే ఆశలో చాలామంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ పండుగల కారణంగా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

3 / 5
ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలు చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా ధరలు తగ్గే అవకాశం ఉండకపొవచ్చంటున్నారు. కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నవంబర్ నుంచి పెళ్లిళ్ల సీజన్ ఉండటం వల్ల పసిడికి డిమాండ్ బలపడుతుంది.

4 / 5
వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు బంగారానికి డిమాండ్ బలంగా కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ధరలు కొనుగోలు చేయాలనుకునేవారికి మెరుగైన అవకాశాన్ని కల్పిస్తున్నాయని అంటున్నారు. దీంతో విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని ఆర్ధిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. త్వరలో పెళ్లి ఉంటే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని సూచనలు చేస్తున్నారు.

5 / 5
పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరగడం వల్ల మేకింగ్ ఛార్జీలు కూడా పెరగవచ్చు. అంతేకాకుండా నగల లభ్యత కూడా తగ్గిపోవచ్చు. దీపావళి సమయంలో బంగారం డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. నవంబర్ 8 నుంచి నవంబర్ 20 వరకు ఉన్న పెళ్లి ముహూర్తాల కారణంగా పసిడి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ధరలు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us