
Gold, Silver Rates: మీరు బంగారం, వెండిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. సోమవారం, జూన్ 1, 2026న బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ మార్కెట్ పోకడలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి స్థానం, దేశీయ డిమాండ్ అన్నీ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా తులం బంగారం ధరపై భారీగా తగ్గింది. ఏకంగా 820 రూపాయల వరకు దిగి వచ్చింది. వెండి అయితే కాస్త పెరిగింది.

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 తగ్గి 1,56,220 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలు తగ్గి 1,43,200 రూపాయలకు చేరగా, 18 క్యారెట్ల బంగారం ధర 610 రూపాయలు తగ్గి 1,17,170 రూపాయలకు చేరింది. వెండి కిలోకు 2,80,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండిని ఆభరణాలలోనే కాకుండా అనేక పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు. అందువల్ల పారిశ్రామిక రంగంలో వెండికి మరింత డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,220 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే వెండి ధర విషయానికొస్తే.. ఇతర ప్రాంతాలకంటే హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర 2,90,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు సంబంధించిన పరిణామాలు, ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాల కారణంగా బంగారం, వెండి ధరలలో ప్రభావం ఏర్పడుతోందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి తెలిపారు. దేశీయ మార్కెట్లో పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అంచనాల కారణంగా ఈ విలువైన లోహాల ధరలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.