Bank Holidays: వచ్చే వారం బ్యాంక్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? సెలవులు ఇవే.. ఇలా ప్లాన్ చేస్కోండి..

Updated on: Nov 14, 2026 | 2:43 PM

నవంబర్ నెలలో పండుగల కారణంగా అనేక బ్యాంక్ సెలువు వచ్చాయి, దీంతో ఈ నెలలో బ్యాంకులను సంప్రదించేందుకు ప్లాన్ చేసుకున్నవారు ఈ సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రాంతీయ పండుగల కారణంగా పలు రాష్ట్రాల్లో మూతపడనున్నాయి. ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ఆయా రాష్ట్రాల సెలవుల జాబితాను తనిఖీ చేయాలి.

1 / 5
నవంబర్ నెలలో అనేక పండుగలు రానుండటం, కార్తీక మాసం కూడా స్టార్ట్ కావడంతో అనేక సెలవులు వస్తున్నాయి. దీపావళి, లక్ష్మీ పూజ, ఛత్ పూజ, గురునానక్ జయంతి వంటి అనేక ముఖ్యమైన పండుగలు వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతి ప్రాంతంలో పండుగలు వేర్వేరు దినాల్లో ఉంటాయి. దీంతో బ్యాంక్ సెలవులు అనేవి రాష్ట్రాలను బట్టి సాధారణంగా మారుతుంటాయని ఖాతాదారులు గమనించాల్సి ఉంటుంది

2 / 5
తమ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులను సందర్శించాలనుకునేవారు ముందుగా తమ ప్రాంతంలో సెలవుల జాబితాను చూడాల్సి ఉంటుంది. ముందస్తుగా ఈ సెలవుల జాబితాను పరిశీలించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. దీని ఆధారంగా తమ బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు. నవంబర్ 15 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు రానున్న వారంలో బ్యాంక్ సెలవులు చూద్దాం.

3 / 5
నవంబర్ 15న ఆదివారం కావడంతో బ్యాంకులు ఉండవు.  నవంబర్ 16 (సోమవారం) ఛత్ పూజ సందర్భంగా పాట్నా,  రాంచీలలో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక నవంబర్ 20 (శుక్రవారం) ఇగాస్ బగ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక నవంబర్ 22 (ఆదివారం) సాధారణ సెలవు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవ్.

4 / 5
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)  క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ప్రాంతీయ, స్థానిక పండుగల ఆధారంగా మారుతుంటాయి. జాతీయ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తే.. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకుల సెలవులు కూడా కొన్నిసార్లు వేర్వేరుగా ఉండవచ్చు. దీంతో బ్యాంక్ ఖాతాదారులు బ్రాంచ్‌ను సందర్శించేముందు ఒకసారి ముందుగా సిబ్బందిని సంప్రదించడం మంచిది.

5 / 5
బ్యాంక్ సెలవుల గురించి ఖాతాదారులందరూ అవగాహన కలిగి ఉండాలి. దీని వల్ల ఎలాంటి అవాంతరాలు ఎదురుకావు. బ్యాంక్ హాలీడేస్‌లో కేవలం బ్రాంచ్‌లు మాత్రమే మూతపడతాయి. దీని వల్ల చెక్ బుక్ క్లియరెన్స్ సేవలు, బ్యాంక్ బ్రాంచ్ ద్వారా చేసే డిపాజిట్లు, విత్ డ్రా సేవలు ఉండవు. ఆన్ లైన్ సేవలు ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us