Ayushman Bharat: పీఎఫ్, ఈఎస్‌ఐ కలిగి ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..? కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఇవే..

Updated on: Jul 30, 2026 | 4:42 PM

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఉచితంగా పొందవచ్చు. అయితే పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటే ఈ స్కీమ్ వర్తించదా..?

1 / 5
దేశంలోని పేద ప్రజలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా దేశంలో లక్షలాది మంది లబ్ది పొందుతుండగా.. కోట్లాది మంది ప్రజలు కార్డులు కలిగి ఉన్నారు. ఈ కార్డుల ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఉచితంగా పొందవచ్చు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది.

2 / 5
అయితే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలు ఉంటాయి. ఇలాంటివారు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు అవుతారా.. లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కేంద్ర నిబంధనల ప్రకారం పీఎఫ్ లేదా ఈఎస్‌ఐ సదుపాయం ఉన్న  ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు అవుతారు.  ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ఈ స్కీమ్ కింద అర్హత పొందవచ్చు.

3 / 5
జాతీయ ఆరోగ్య సంస్థ, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) మధ్య కీలక ఒప్పంద జరిగింది. దీని ప్రకారం ESI లబ్ధిదారులు PM-JAY ప్యానెల్‌లో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చు. దీంతో పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉన్నంత మాత్రాన ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదని అనుకోవడ పొరపాటు. వీళ్లు కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు పొంది ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

4 / 5
త్రిపుల్ బెడ్ రూమ్, ఆపైన గదులున్న పక్కా ఇల్లు ఉన్నవారు, ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండటం, ప్రభుత్వ నమోదిత వ్యవసాయేతర సంస్థను నడుపుతున్న కుటుంబాలు, త్రిచక్ర లేదా నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఇలాంటివారికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తించదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

5 / 5
PM-JAY లబ్ధిదారుల పోర్టల్ లేదా యాప్‌లోని (Am I Eligible) ఆప్షన్ ద్వారా అర్హతను పరిశీలించుకోవచ్చు. మొబైల్ నంబర్, పేరు, రాష్ట్రం, రేషన్ కార్డు, లేదా ఇంటి నంబర్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. అర్హుత ఉండే ఆన్‌లైన్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే వెంటనే కార్డు ఆన్‌లైన్‌లో జారీ అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us