
ఆధార్‌లో తప్పులు ఉన్నాయా.? మీరు సులువుగా మార్చుకోవచ్చు. ఆధార్‌లో ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, పేరు, మొబైల్ నెంబర్ వంటి ఏ వివరాల్లో తప్పు ఉన్నా.. మీరు ఇంటి వద్ద నుంచే మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. గతంలో గంటలకొద్ది ఆధార్ సెంటర్లలో వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పని తప్పింది.

రూల్స్ ప్రకారం.. పేరు రెండుసార్లు మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశముంది. ఆధార్ తొలిసారి తీసుకున్న సమయంలో ఉన్న తేదీకి అటుఇటుగా మూడేళ్లు మాత్రమే మార్చుకునే అవకాశముంది. ఇక జెండర్ ఒకసారి మాత్రమే మార్చుకునే ఛాన్స్ ఉంది. అటు ఫొటో మార్చుకోవడానికి మాత్రం ఎలాంటి పరిమితులు లేవు.

ఫొటో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. మీరు ఫొటో మార్చాలంటే ఖచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి వీలు కాదు. ఇక అడ్రస్ విషాయానికొస్తే ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు విధించలేదు.

ఇక వీటి పరిమితి దాటాక వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ పరిమితులకు మంచి మార్చుకోవాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఎందుకు మార్చాల్సి వస్తుందనేది వివరించారు. ఈమెయిల్, పోస్ట్ ద్వారా ఆధార్ నమోదు కేంద్రంలో విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

ఆధార్ వివరాలతో పాటు డాక్యుమెంట్స్,యూఆర్ఎన్ స్లిప్పులను help@uidai.gov.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి వారికి సమంజంసమని అనిపిస్తే డీటైల్స్ మార్చుకోవడానికి అనుమతిస్తారు. లేకపోతే దరఖాస్తు రిజెక్ట్ చేస్తారు. ఇక భువన్ ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లి మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు