
అయితే డబ్బులు పొదుపు చేసుకోవాలని అనుకుంటే 3Eని ఎంచుకోండి. రాత్రిపూట త్రీటైర్ ఏసీ కోచులు నిద్రించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. అదే 3E కోచ్‌లు కొంచెం ఇరుకుగా ఉండటం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అసౌకర్యంగా ఉండవచ్చు.

ఇక తక్కువ ధరలో ఏసీ ప్రయాణం చేయాలనుకునేవారికి 3E అనేది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇక ఈ కోచ్‌లలో అనేక అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ బెర్త్‌కు మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, రీడింగ్ లైట్లు, ఏసీ వెంట్స్ ఉంటాయి. అయితే బెర్తులు కొంచెం ఇరుకుగా ఉంటాయి. మీకు విశాలమైన స్థలం కావాలనుకుంటే త్రీ టైర్ ఏసీ బుక్ చేసుకోవడం మంచిది.

అయితే 3AC, 3E మధ్య అనేక తేడాలు ఉన్నాయి. 3 ఏసీలో 72 బెర్త్‌లు ఉంటాయి. కానీ 3Eలో కేవలం 80 నుంచి 83 బెర్త్‌లు ఉంటాయి. అంటే త్రీ టైర్ ఏసీలో కంటే 3Eలో బెర్త్‌లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బెర్త్‌ల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఈ కారణంతో కాస్త ఇరుకుగా అనిపిస్తుంది. దీని వల్ల త్రీటైర్ ఏసీతో పోలిస్తే 3Eలో టికెట్ ధర 6 నుంచి 8 శాతం వరకు తక్కువగా ఉంటుంది.

రైల్వేశాఖ సామాన్యులకు కూడా తక్కువ ధరలో ఏసీ రైలు ప్రయాణం అందించేందుకు 3E అనే కొత్త కోచ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఏసీ ఎకానమీ కోచ్‌లుగా పరిగణిస్తారు. తక్కువ ఖర్చుతో ఇందులో ఏసీ ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. త్రీ టైర్ ఏసీగా ప్రత్యామ్నాయంగా బడ్జెట్ వెర్షన్‌గా దీనిని చెబుతున్నారు. త్రీ టైర్ ఏసీ కంటే తక్కువ ఛార్జీ ఈ కోచ్‌లలో ఉంటుంది.

ట్రైన్లలో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక ఏసీ క్లాసుల్లో త్రీ టైర్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. అయితే త్రీ టైర్ ఏసీనే కాకుండా 3E కోచ్‌లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అసలు 3AC, 3E మధ్య తేడాలు ఏంటనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ రెండు ఏసీ స్లీపర్ క్లాసులు అయినప్పటికీ.. కొన్ని తేడాలున్నాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం.