Bike Sales: తక్కువ ధర, ఎక్కువ మైలేజీతో లభించే 5 బెస్ట్ బైక్‌లు ఇవే.. మీరూ చూసేయ్యండి..

|

Mar 08, 2023 | 1:10 PM

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజలకు కొత్త బైక్ కొనాలంటే.. హై-బడ్జెట్‌తో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ మైలేజీని అందించే బైక్‌ల వైపు మొగ్గు చూపుతుంటారు. మరి ఈ రోజు మీ ముందుకు అలాంటి బైక్‌లను తీసుకొచ్చేశాం.

1 / 5
బజాజ్ ప్లాటినా: గరిష్ట మైలేజీని ఇచ్చే బైక్‌ల విషయానికొస్తే, బజాజ్ ప్లాటినా ముందు వరుసలో ఉంటుంది. ఈ వాహనం 115.45సీసీ BS6 ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 8.44 బిహెచ్‌పి పవర్, 9.81 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ ధర దాదాపు 67 వేల రూపాయలు. ఒక లీటర్‌కు 70 నుంచి 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

2 / 5
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్: అత్యధిక మైలేజీని ఇచ్చే హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 7.91 బిహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 97.2 సిసి ఇంజిన్‌ని పొందుతారు. ఈ బైక్ ప్రారంభ ధర దాదాపు 61 వేల రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఇది ఒక లీటర్ పెట్రోల్‌కు 65-70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

3 / 5
BAJAJ CT 125X: అత్యంత మైలేజీనిచ్చే బైక్‌ల జాబితాలో బజాజ్ బైక్‌ల పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈ వాహనంలో 124.4 సీసీ ఇంజిన్ అమర్చబడి ఉంది. 0.9 @ 8000 rpm పవర్ 11 Nm @ 5500 టార్క్ ఉత్పత్తి చేయగలదు.ఈ బైక్ 59.6 km వరకు మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 75 వేల వరకు ఉంటుంది.

4 / 5
హోండా సీడీ 110: అధిక మైలేజీని ఇచ్చే బైక్‌ల జాబితాలో హోండా సీడీ110 కూడా ఒకటి. ఈ బైక్‌లో 109.51 సీసీ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది 9.30 Nm @ 5500 rpm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.47,398 నుంచి రూ.75,179 వరకు ఉంటుంది.

5 / 5
TVS స్టార్ సిటీ ప్లస్: ఈ బైక్‌లో 109.7సీసీ ఇంజిన్ అమర్చబడి ఉంది. దీని ప్రారంభ ధర 70 వేల రూపాయలు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌లో 70-80 కిమీ మైలేజీని ఇస్తుంది.ఈ బైక్ 8.7 @ 4500 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.