Rain Alert: రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Updated on: Sep 11, 2024 | 3:57 PM

తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి.. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటచేసింది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వర్షాలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి.. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. అతలాకుతలమయ్యాయి.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటచేసింది.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలతో బుధవారం ప్రకటన విడుదల చేసింది.

2 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్-యానాం :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

3 / 5
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

4 / 5
రాయలసీమ:- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

5 / 5
ఇవాళ ఈ ప్రాంతాల్లో వర్షాలు.. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us