బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Updated on: Nov 12, 2026 | 7:10 AM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగనుండగా, పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలాఉంటే.. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది.

2 / 5
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

3 / 5
ఇది వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా (Well Marked Low-Pressure Area) మారే అవకాశం ఉందని తెలిపారు.. ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

4 / 5
శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి,  మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇది ఏటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత రానుందని తెలిపారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పై దీని ప్రభావం లేదని వెల్లడించారు.

5 / 5
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, యానంలో.. తెలంగాణ ప్రాంతంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి..

Loading...
Unable to load recommendations.
Follow Us