వర్షాలు కురుస్తాయా..? సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Updated on: Sep 13, 2026 | 8:14 PM

అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

1 / 6
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో సోమవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో రాజస్థాన్ , గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు.

2 / 6
దీని ప్రభావంతో సోమవారం (14-09-2026) మన్యం,  అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు,మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

3 / 6
ఇక తెలంగాణలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

4 / 6
ఆదవారం ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. అల్లూరి జిల్లా కించూరులో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగువంకలు పొంగిపొర్లుతున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. GK వీధి మండలం ఐస్ గెడ్డ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది.

5 / 6
ప్రకాశం జిల్లా అద్దంకిలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పెనుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరగడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. NTR జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ- హైదరాబాద్‌ హైవేలో భారీవృక్షం నేలకూలింది. ఇక.. కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ మూడు రోజుల వర్షసూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

6 / 6
తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను భారీవర్షాలు ముంచెత్తాయి. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లోనూ వాగులువంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నెపల్లిలో రికార్డ్‌ స్థాయి వర్షపాతం నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి మణుగూరు బొగ్గుగని బురదతో నిండడంతో ఉత్పత్తి ఆగిపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us