1 / 7
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి. ఇది రుచిగా ఉండటంతోపాటు.. అనేక సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.. అయితే.. జామకాయతోపాటు.. దీని ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి.. జామాకులు పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు... ప్రధానంగా ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను నేరుగా నమలవచ్చు లేదా ఈ ఆకులను ఉపయోగించి తయారుచేసిన డికాక్షన్ ను కూడా తీసుకోవచ్చు. జామ ఆకులు ఎలాంటి వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతాయో తెలుసుకోండి..