రెండు కళ్లు చాలవు.. ఈ అందమైన పూలను మీరెక్కడైనా చూశారా?

Edited By:

Updated on: Apr 29, 2026 | 5:50 PM

అల్లూరి మన్యంలో వికసిస్తున్న బెల్లడోనా లిల్లీ పూలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. 'నేకెడ్ లేడీ' అని కూడా పిలువబడే ఈ గులాబీ రంగు సువాసనభరిత పుష్పాలు వసంతకాలంలో పూస్తాయి. మన్యం ప్రాంతంలోని అనుకూల వాతావరణం కారణంగా ఈ అలంకార పూలు అద్భుతంగా వికసించి, పరిసరాలకు ప్రత్యేక అందాన్ని ఇస్తున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
ప్రకృతిలో విభిన్న రకాల పూలు, పండ్ల, ఔషధ మొక్కలు చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో వేటికవే ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటాయి. కొన్ని మనకు తెలిసినవే అయితే.. మరికొన్ని తెలియనివి. పూల మొక్కలకు పూసిన పూలను ఎక్కువగా అలంకారానికే వినియోగిస్తారు. వాటిలో ఒకటి బెల్లడోనా లిల్లీ. వాటినే అమరిల్లిస్ బెల్లడోనా అని కూడా అంటారు.

2 / 5
 బెల్లడోనా లిల్లీ.. గులాబీ రంగులో సువాసన గల పూలను వసంతకాలంలో పూచే మొక్క. తెలుపు, ముదురు గులాబీ రంగుల్లో జాతులు ఉన్నప్పటికీ లేత గులాబీ రంగు పూల అందమే వేరు. ప్రకాశవంతమైన ఆకర్షణీయమైన పూలతో ఇది అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది.

3 / 5
 ఇలా ఈ పూలు ఇప్పుడు అల్లూరి మన్యం లో కను విందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పొలాల్లో మరి కొన్నిచోట్ల ఇంటి పెరట్లో విరబూసి తమ వైపు ఆకర్షిస్తున్నాయి. సువాసన వెదజల్లుతూ, ఆకర్షణీయమైన రంగుతో ఆకట్టుకుంటున్నాయి. జీకే వీధి మండలం  దుచ్చరిపాలెం గ్రామంలో ఓ గిరిజనుడు ఇంటి పెరట్లో  ఈ పూలు వికసించి తన గొప్పతనాన్ని చాటుతున్నాయి. ప్రకాశవంతమైన రంగులతో మెరిసే ఈ పుష్పాలు పరిసరాలకు మరింత వన్నె తెచ్చాయి. ఏజెన్సీలో అనుకూల వాతావరణం ఉండడంతో పుష్పాలు విరబూస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

4 / 5
 అందుకే ఆ పేరు.. బెల్లడోనా లిల్లీ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది దుంప జాతి మొక్క. మొక్కకు ఆకులు రాలిన తర్వాత.. పొడవాటి కాండం కాండంపై ఈ పూలు పూస్తాయి. అందుకే దీనికి 'నేకెడ్ లేడీ' అని కూడా పిలుస్తారు. వసంతకాలంలో విరబూసి,శరదృతువు వరకు దీని సీజన్.

5 / 5
 ' ఇది ఒక అలంకార పూల మొక్క.. వేసవికాలంలోనే ఈ పుష్పాలు వికసిస్తాయి. మన్యంలో అనుకూల వాతావరణం ఉండడంతో  పుష్పిస్తున్నాయి.' అని అన్నారు చింతపల్లి ఉద్యాన శాస్త్రవేత్త రమణ. అయితే ఈ మొక్క కొన్ని పెంపుడు జంతువులకు అస్వస్థకు గురి చేసే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.

Follow Us