750 ఏళ్ల చరిత్ర.. 2 కిలోల బంగారు ఆభరణాలు.. కురుమూర్తి స్వామి అలంకరణ వెనుక ఆశ్చర్యపరిచే కథ!

Edited By:

Updated on: Nov 15, 2026 | 9:42 AM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన కురుమూర్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా అలంకార మహోత్సవం భక్తులకు కనువిందు చేస్తుంది. స్వామివారు, అమ్మవార్లు విలువైన స్వర్ణాభరణాలతో ముస్తాబై దర్శనమిస్తే ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.

1 / 6

2 / 6
అయితే ఈ ఆభరణాల వెనుక దాదాపు 750 ఏళ్ల చరిత్ర, ఒక సంస్థాన వంశానికి తరతరాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయం దాగి ఉంది. ఆత్మకూరు, అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్థులకు కురుమూర్తి స్వామి ఇలవేల్పు. ఈ వంశానికి మూలపురుషుడైన గోపాల్ రెడ్డి 1268 నుంచి స్వామివారిని ఆరాధిస్తున్నట్లు క్షేత్ర చరిత్ర చెబుతోంది.

3 / 6
ఆయన నుంచి ప్రస్తుత సంస్థానాధీశుడు శ్రీ రాంభూపాల్ వరకు సుమారు 30 తరాల ముక్కెర వంశస్థులు కురుమూర్తి క్షేత్ర అభివృద్ధికి కృషి చేశారు. వీరు ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. నాటి నుంచి నేటి వరకు అదే ఆచార సంప్రదాయం కొనసాగుతోంది.ముక్కెర వంశస్థులలో సీతారామ భూపాల్ కాలం కురుమూర్తి స్వామి ఆభరణాల చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఆ సమయంలో స్వామివారికి సుమారు రెండు కిలోల బరువున్న విలువైన స్వర్ణాభరణాలను సమర్పించారు.

4 / 6
ఇక అలంకార మహోత్సవం సందర్భంగా ఆభరణాల తరలింపు కూడా ఓ ప్రత్యేక వేడుకే. ఆత్మకూరులోని ఎస్‌బీఐ బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య భారీ ఊరేగింపుగా ఆత్మకూరు నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురంలోని సంస్థానాధీశుల నివాసానికి తీసుకెళ్తారు. అక్కడ సంస్థానాధీశులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆభరణాలను కొండపైకి చేరుస్తారు.

5 / 6
ఇందులో కిరీటం, కోర మీసాలు, హస్తాలు, భుజకీర్తులు, శంఖు, చక్రాలతో పాటు పలు రకాల హారాలు ఉన్నాయి. ఒక్కో ఆభరణానికి ఒక్కో ప్రత్యేకత ఉండటంతో అలంకార మహోత్సవంలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక అలంకార మహోత్సవం సందర్భంగా ఆభరణాల తరలింపు కూడా ఓ ప్రత్యేక వేడుకే. ఆత్మకూరులోని ఎస్‌బీఐ బ్యాంకు లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య భారీ ఊరేగింపుగా ఆత్మకూరు నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురంలోని సంస్థానాధీశుల నివాసానికి తీసుకెళ్తారు.

6 / 6
అక్కడ సంస్థానాధీశులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆభరణాలను కొండపైకి చేరుస్తారు. ఇక కొండపైకి చేరిన అనంతరం ఆభరణాలన్నింటినీ స్వామివారు, అమ్మవార్లకు అలంకరిస్తారు. కిరీటం నుంచి హారాల వరకు వివిధ ఆభరణాలతో స్వామివారిని ముస్తాబు చేస్తారు. ఈ స్వర్ణాలంకరణలో స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలంకార ప్రియుడైన కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. తరాలు మారినా తరగని భక్తి.. కాలం మారినా మారని సంప్రదాయం కురుమూర్తి స్వామివారి అలంకరణ మహోత్సవం.

Loading...
Unable to load recommendations.
Follow Us