అయ్య‌ప్ప భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. రేప‌టి నుంచి శ‌బ‌రిమ‌ల‌లో రోజుకు 5 వేల మంది భ‌క్తుల‌కు అనుమ‌తి

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఇది శుభ‌వార్తే. ఈనెల 20వ తేదీ నుంచి శ‌బ‌రిమ‌ల‌కు రోజుకు ఐదు వేల చొప్పున భ‌క్తుల‌ను అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. కేర‌ళ హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో భ‌క్తుల‌కు ....

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. రేప‌టి నుంచి శ‌బ‌రిమ‌ల‌లో రోజుకు 5 వేల మంది భ‌క్తుల‌కు అనుమ‌తి
Follow us

|

Updated on: Dec 19, 2020 | 1:19 PM

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు ఇది శుభ‌వార్తే. ఈనెల 20వ తేదీ నుంచి శ‌బ‌రిమ‌ల‌కు రోజుకు ఐదు వేల చొప్పున భ‌క్తుల‌ను అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. కేర‌ళ హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో భ‌క్తుల‌కు ఈ వెసులుబాటు క‌లిగిన‌ట్ల‌యింది. అయితే శబ‌రిమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులు మాత్రం కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకుని వ‌స్తేనే అనుమతి అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఉంటుంద‌ని శ‌బ‌రిమ‌ల ఆల‌య అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్టు త‌ప్ప‌ని స‌రి అని తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రోజుకు 2 వేల మంది, శ‌ని, ఆదివారాల్లో 3 వేల చొప్పున భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తున్నారు. ఇక వార్షిక మండ‌ల మ‌క‌ర‌విళ‌క్కు పూజ కోసం దేవ‌స్థానాన్ని న‌వంబ‌ర్ 15వ తేదీ సాయంత్రం తెరిచారు. ఈ పూజ రెండు నెల‌ల‌పాటు కొన‌సాగ‌నుంది. అయితే భ‌క్తుల తాకిడి ఎక్కువ‌య్యే నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

కాగా, ఎంతో పేరొందిన పుణ్య‌క్షేత్రం శ‌బ‌రిమ‌ల‌కు ఎక్కువ మంది భ‌క్తులు వెళ్ల‌డానికి అవ‌కాశం ఇస్తే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, చ‌ర్య‌ల‌పై శ‌బ‌రిమ‌ల‌లో హైఅథారిటీ క‌మిటీ స‌మావేశ‌మైంది. ప్ర‌తి రోజు ఐదువేల మంది భ‌క్తుల‌కు అనుమ‌తించాల‌ని కేర‌ళ హైకోర్టు ఆదేశిస్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపై ముందుగానే స‌మావేశ‌మై చ‌ర్చించారు.

శ‌బ‌రిమ‌ల‌లో ఉద్యోగం చేస్తూ సాటి ఉద్యోగులు, శ‌బ‌రిమ‌ల‌కు వ‌చ్చి వెళ్తున్న అయ్య‌ప్ప‌స్వామి భ‌క్తుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది అంద‌రికి త‌ప్ప‌కుండా కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని శ‌బ‌రిమ‌ల హైఅథారిటీ క‌మిటీ నిర్ణ‌యించింది. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ అన తేలితే కొండ‌కింద‌కు పంపించాల‌ని, వారు మ‌ళ్లీ విధుల‌కు హాజ‌రు కాకుండా చూడాల‌ని శ‌బ‌రిమ‌ల దేవ‌స్వం బోర్డు నిర్ణ‌యించింది.