AP Municipal Election campaign close : ఎక్కడివారక్కడే గప్ చుప్.. ఏపీలో ముగిసిన మున్సిపల్ ప్రచారం

|

Mar 08, 2021 | 5:12 PM

AP Municipal Election campaign close :  ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక  బయటి ప్రాంతాల నేతలు వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్థానిక నేతలు మాత్రమే ఉండాలి.

AP Municipal Election campaign close : ఎక్కడివారక్కడే గప్ చుప్.. ఏపీలో ముగిసిన మున్సిపల్ ప్రచారం
Follow us on

AP Municipal Election campaign close :  ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక  బయటి ప్రాంతాల నేతలు వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్థానిక నేతలు మాత్రమే ఉండాలి. ఐదు దాటితే ఎక్కడా జెండాలు కనిపించకూడదు. ప్రచారం అసలే చేయకూడదు.

ఎల్లుండి(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి ఐదు గంటల పోలింగ్‌ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మాస్క్‌ తప్పనిసరి. బ్యాలెట్‌ పద్ధతినే ఈ ఎన్నిక జరుగుతుంది. 14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ఉంటుంది.12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ దక్కించుకోవాలనేది వైసీపీ వ్యూహం. ఏ ఒక్క మున్సిపాల్టీ కూడా టీడీపీకి వెళ్లకుండా ఎన్నికల ప్లాన్లు వేసింది. అందుకే ఇంటింటి ప్రచారానికే ఎక్కువగా ప్రయార్టీ ఇచ్చింది. మంత్రులు, ఎంపీలు అభ్యర్థులతోపాటు కాలనీలకు వెళ్లి ప్రచారం చేశారు.

టీడీపీ మాత్రం రోడ్‌షోలు నిర్వహించింది. విశాఖ, విజయవాడ, గుంటూరుల్లోనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు చంద్రబాబు. ఈ మూడు కార్పొరేషన్లు ఆ పార్టీకి అత్యంత కీలకం. విజయవాడ, గుంటూరుల్లో అమరావతి ప్రభావం ఉందనేది ఆ పార్టీ అంచనా. ఇక్కడ గెలవడం ద్వారా మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం టీడీపీది. విశాఖలోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. వైసీపీ ఇంకా వ్యూహాత్మకంగా విజయవాడ, గుంటూరు, విశాఖలపై ఫోకస్‌ పెట్టింది. మిగిలిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఒక ఎత్తు… ఈ మూడు కార్పొరేషన్లలో గెలుపు మరో ఎత్తు. అదే ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిగా మారింది.

12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే… 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 75 మున్సిపాల్టీల్లో 2123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు ఉన్నాయి. ఏకగ్రీవాల్లో వైసీపీ 570 వార్డులు వచ్చాయి. టీడీపీకి ఆరు, బీజేపీకి ఒకటి, ఇతరులు రెండు చోట్ల ఏకగ్రీవంగా గెలిచారు. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్లల్లో వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఏకగ్రీవాలను బట్టి రాయచోటి, పలమనేరు, ఆత్మకూరు మున్సిపాల్టీలు వైసీపీవే. నాయుడుపేట, సూళ్లురుపేట, కొవ్వూరుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్లు అవుతారు. డోన్‌, తుని మున్సిపాల్టీల్లోనూ వైసీపీదే హవా.

ఇక అధికార పార్టీ అయిన వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో ప్రత్యేక టీమ్‌ ఈ ఎన్నికల కోసం పని చేస్తోంది. విజయవాడలో ప్రతి డివిజన్‌కు ఒక అబ్జర్వర్‌ను పెట్టారు. దొంగ ఓట్లను పట్టుకోవడం, ప్రచార వ్యూహాలను మార్చడంలో ఈ టీమ్‌ ఫుల్ బిజీలో ఉంది.

Read also : Chandrababu Guntur People : గుంటూరు ప్రజలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. స్వార్థపరులు, రోషం లేనివాళ్లు, చేవచచ్చిన వాళ్లని వ్యాఖ్యలు