Mahatma Gandhi ideals: గాంధీ ఆశయాలని పాటిస్తున్న ప్రత్యేక తెగ.. హింస వద్దు అహింసే ముద్దు..!

|

May 15, 2022 | 6:20 AM

Mahatma Gandhi ideals: నేడు ప్రపంచం ఎంతో ఆధునికంగా మారినప్పటికీ నేటికీ కొంతమంది అడవులలో నివసించే వారు అలాగే ఉన్నారు. ఈ వ్యక్తుల జీవితం మన జీవితానికి చాలా భిన్నంగా

Mahatma Gandhi ideals: గాంధీ ఆశయాలని పాటిస్తున్న ప్రత్యేక తెగ.. హింస వద్దు అహింసే ముద్దు..!
Malaysia Semai Tribe
Follow us on

Mahatma Gandhi ideals: నేడు ప్రపంచం ఎంతో ఆధునికంగా మారినప్పటికీ నేటికీ కొంతమంది అడవులలో నివసించే వారు అలాగే ఉన్నారు. ఈ వ్యక్తుల జీవితం మన జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది. వీరు వారి ఆచారాలు, విభిన్న నమ్మకాల కారణంగా ఎప్పుడు చర్చలో ఉంటారు. వీరి పద్దుతులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అడువులలో నివసించే వారిలో ప్రపంచవ్యాప్తంగా చాలా తెగలు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం ఒక తెగ గురించి తెలుసుకుందాం. మలేషియాలోని సెమై పేరుతో ఒక ప్రాచీన తెగ ఉంది. దీనిని ఒరాంగ్ దళం అని కూడా పిలుస్తారు. వీరు ఆగ్నేయాసియా స్థానికులుగా పరిగణిస్తారు. ఈ తెగ క్రీస్తుపూర్వం 8000 నుంచి 6000 మధ్యకాలంలో మలయ్ ద్వీపకల్పానికి చేరుకుంది. ప్రస్తుతం వీరు ఆగ్నేయాసియాలోని మలయ్ ద్వీపకల్పంలో నివసిస్తున్నారు.

మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గాన్ని ఈ తెగ చాలా కాలంగా అనుసరిస్తోంది. ఈ తెగ ప్రజలకి సహనం, ఓపిక ఎక్కువగా ఉంటుంది. వారు ఎప్పుడూ ఎలాంటి గొడవలకు దిగరు. అయితే వారి సహనాన్ని బలహీనతగా భావించవద్దు. నివేదిక ప్రకారం మలయన్ ఎమర్జెన్సీ సమయంలో బ్రిటిష్ వారు కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికి సెమాయ్ తెగకు చెందిన వారిని ఉపయోగించారు. ఈ జాతి ఆహారం కోసం స్లాస్, బర్న్‌ అనే పంటలని పండిస్తుంది. దీంతోపాటు చేపల పెంపకం, కోళ్ల పెంపకం, మేకల పెంపకం చేస్తారు. ఇది చాలా తక్కువ జనాభా కలిగిన తెగ. నివేదిక ప్రకారం వారి జనాభా 49 వేలు మాత్రమే. ఈ తెగ ఆచారాల ప్రకారం.. ఒకరిని బాధపెట్టడం మీ కోరికలను వారిపై రుద్దడం తప్పు. ఈ నమ్మకాల కారణంగా ఈ ప్రజలు తమ ఆహారాన్ని అందరికి పంచిపెట్టి తింటారు. ఈ తెగలో ఎవరైనా పెద్ద వేట చేసినట్లయితే దానిని మొత్తం విభజించి తింటారు.

మరిన్ని వింత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

TS Police Recruitment 2022: పోలీసు ఉద్యోగాలకి గట్టి పోటీ.. ఒక్క రోజే 4.50 లక్షల దరఖాస్తులు..!