Fact-Check: ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. ఆ కాలేజ్ సర్కులర్ వైరల్.. అది నిజమేనా..?

|

Jan 28, 2021 | 5:28 PM

ఆగ్రాలోని ఓ ప్రముఖ కాలేజీ.. ఆ కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు వెరైటీ సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో అమ్మాయిలూ..మీకు 'వాలెంటైన్స్‌ డే నాటికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే.

Fact-Check: ప్రతి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిందే.. ఆ కాలేజ్ సర్కులర్ వైరల్.. అది నిజమేనా..?
Follow us on

ఆగ్రాలోని ఓ ప్రముఖ కాలేజీ.. ఆ కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు వెరైటీ సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో అమ్మాయిలూ..మీకు ‘వాలెంటైన్స్‌ డే నాటికి కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే. లేకపోతే కాలేజీలోకి నో ఎంట్రీ. అలాగే మీకు బాయ్‌ఫ్రండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారితో కలిసి దిగిన లేటెస్ట్‌ ఫొటోలను ఫ్రూఫ్ క్రింద చూపించాలి. ఇది మీ సేఫ్టీ కోసమే’  అంటూ ఓ కాలేజీ రిలీజ్ చేసినట్లు చెబుతోన్న సర్కులర్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది.

అంతటితో ఆగకుండా ‘అమ్మాయిలూ..ప్రేమను పంచండి’ అంటూ సర్క్యులర్‌ ద్వారా ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో గల ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైనట్టు కనబడుతున్న ఈ సర్క్యులర్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.  ప్రొఫెసర్ అశిశ్ శర్మ సంతకంతో జనవరి 14న ఇది జారి అయ్యింది. అయితే ఈ సర్క్యులర్ మొదట కాలేజీ స్టూడెంట్స్ వాట్సాప్‌ గ్రూపుల ద్వారానే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో కాలేజీ విద్యార్థులు ఈ విషయాన్ని వారి వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అలా.. ఈ వ్యవహారమంతా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో సదరు ప్రిన్సిపాల్ స్పందించారు. ఇది కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రొ. అశిశ్ శర్మ అనే పేరుగల లెక్చరర్ అసలు తమ కాలేజీలో లేరని ష్టం చేశారు. ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు అనే విషయంపై ఎంక్వయిరీ వేసి వారిని వెతికి పట్టుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, అమ్మాయిల్ని ఆట పట్టించడానికి ఫైనలియర్ విద్యార్థులెవరైనా ఇటువంటి కొంటె పనులు చేసి ఉండవచ్చని కాలేజీ వర్గాలు అనుమాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఆగ్రాలోని ప్రముఖ కాలేజీల్లో ఒకటైన సెయింట్ జాన్స్‌ను 1850లో బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు.

Also Read:

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

Parliament canteen: ఇకపై రాయితీలు లేవు.. పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరలు.. హైదరాబాదీ మటన్ బిర్యానీ ధర..?