భారత్-పాక్ మధ్య మిఠాయిల పంపిణీ కట్

71 వ రిపబ్లిక్ డే సందర్భంగా భారత్, పాకిస్తాన్ సరిహద్దు కాపలా దళాలు సాంప్రదాయ వేడుకలకు స్వస్తి పలికాయి. ఎందుకంటే పాకిస్తాన్ రేంజర్స్ సరిహద్దు భద్రతా దళం, బిఎస్‌ఎఫ్ తో స్వీట్లు, శుభాకాంక్షలు పంచుకోడానికి నిరాకరించారు అని బిఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు. అటారి-వాగా సరిహద్దు వద్ద భారత్, పాకిస్తాన్ దళాలు ఈద్-అల్-ఫితర్ సందర్భంగా, గత సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా స్వీట్లు మార్పిడి చేసుకున్నాయి. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ఇరు దేశాల […]

భారత్-పాక్ మధ్య మిఠాయిల పంపిణీ కట్
Follow us

| Edited By:

Updated on: Jan 26, 2020 | 10:05 PM

71 వ రిపబ్లిక్ డే సందర్భంగా భారత్, పాకిస్తాన్ సరిహద్దు కాపలా దళాలు సాంప్రదాయ వేడుకలకు స్వస్తి పలికాయి. ఎందుకంటే పాకిస్తాన్ రేంజర్స్ సరిహద్దు భద్రతా దళం, బిఎస్‌ఎఫ్ తో స్వీట్లు, శుభాకాంక్షలు పంచుకోడానికి నిరాకరించారు అని బిఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు.

అటారి-వాగా సరిహద్దు వద్ద భారత్, పాకిస్తాన్ దళాలు ఈద్-అల్-ఫితర్ సందర్భంగా, గత సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా స్వీట్లు మార్పిడి చేసుకున్నాయి. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ఇరు దేశాల మధ్య మిఠాయిల పంపిణీ జరగలేదు.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఎన్నో ఏళ్లుగా వస్తున్న మిఠాయిల పంపిణీ సంప్రదాయాన్ని ఇరు దేశాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.